వివాదంలో ఎమ్మెల్యే 'రాజాసింగ్' పాట.. ''హిందుస్తాన్ జిందాబాద్'' ట్యూన్ మాదంటున్న పాక్
హైదరాబాద్ : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి పాకిస్తాన్ ఆర్మీ.. రాజాసింగ్ ను టార్గెట్ చేసింది. శ్రీరామ నవమి సందర్భంగా ఆయన విడుదల చేసిన "హిందుస్తాన్ జిందాబాద్" పాటపై ఆరోపణలు గుప్పించింది. ఆ సాంగ్ మా నుంచి కాపీ కొట్టారంటూ ట్విట్టర్ వేదికగా మాటల తూటాలు సంధించింది.

"పాకిస్తాన్ జిందాబాద్" అనే పాటను ఇటీవల పాకిస్తాన్ డే సందర్భంగా విడుదల చేశారు. తమ దేశానికి చెందిన మీడియా వింగ్ ఆ పాటను రిలీజ్ చేసినట్లు పేర్కొన్నారు పాక్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్. మా సాంగ్ ను రాజాసింగ్ కాపీ కొట్టారని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.
పాకిస్తాన్ మాదంటూ క్లెయిమ్ చేసుకున్న సాంగ్ ఇదే :
ఆదివారం (14.04.2019) నాడు శ్రీరామ నవమి సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్.. హిందుస్తాన్ జిందాబాద్ అనే పాటను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. భారత సైనికులకు ఆ పాటను అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.
రాజాసింగ్ రిలీజ్ చేసిన పాట ఇదే :
My new song which will be released on 14th April at 11:45 AM on the occasion of #SriRamNavami is dedicated to our #IndianArmy forces. pic.twitter.com/Es391cE2PT
— Chowkidar Raja Singh (@TigerRajaSingh) April 12, 2019
రాజాసింగ్ ఈ పాటను రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే.. పాక్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మా పాటను కాపీ కొట్టి భారత సైన్యానికి అంకితమిస్తారా అంటూ ప్రశ్నించారు. ఇటీవల ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. ఈ సాంగ్ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతోందననే ఉత్కంఠ నెలకొంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications