New Year 2023: న్యూ ఇయర్‍కు తాగొచ్చు.. ఊగొచ్చు..! రాత్రి ఒంటి గంట వరకు పర్మిషన్..
మరో 11 రోజుల్లో 2022 సంవత్సరం ముగిసి 2023 సంవత్సరం రాబోతోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరు సిద్ధమయ్యాయి. మరి న్యూఇయర్ అంటే ఏం సంబరాలుంటాయంటే.. మందు.. విందే.. ఈ 31 డిసెంబర్ ఏంజాయి చేయడానికి యువత సిద్ధమయ్యారు.

ఒంటి గంట వరకు
అయితే మనోళ్లకు ఛాన్స్ డిసెంబర్ 31 నైట్ నుంచి జనవరి 1 వరకు తాగుతూనే ఉంటారు. అందుకే టైమ్ లిమిట్ పెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 31 రాత్రి నంచి జనవరి 1 నైట్ 1 గంట వరకు న్యూ ఇయర్ ఈవెంట్లకు పర్మిషన్ ఉంటుందని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.

అవాంఛనీయ ఘటనలు
కొత్త సంవత్సరం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈవెంట్స్ నిర్వహించే ఆర్గనైజర్లు, పబ్స్, హోటల్స్, రిసార్ట్ నిర్వాహకులు 10 రోజులు ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన నిబంధనలను ఆదివారం మీడియాకు వెల్లడించారు. హోటళ్లు, పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్స్ సంస్థలు నిర్వహించే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు నిబంధనలు ప్రవేశపెట్టారు.

45 డెసిబుల్స్
వేడుకలు జరిగే ప్రదేశాల్లో ఎంట్రీ,ఎగ్జిట్ పాయింట్స్, పార్కింగ్ ఏరియాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. అసభ్యకర డ్యాన్సులు చేయిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డీజే సౌండ్ 45 డెసిబుల్స్ మించొద్దని, ఈవెంట్లకు పరిమితికి మించి అనుమతిచ్చొద్దని తెలిపారు.

మద్యం సేవించి
సెలబ్రేషన్ ముగిసిన తర్వాత మద్యం సేవించినవారు డ్రైవింగ్ చేయకుండా ఇంటికి చేరేలా చూసే బాధ్యత యాజమాన్యాలదేనని పోలీసులు స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఈవెంట్స్ పార్కింగ్ ప్రదేశాల్లో డ్రగ్స్, గంజాయి అమ్మకాలు చేసినా యాజమాన్యందే బాధ్యత అని తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

జైలు శిక్ష
ఈ నెల 31న రాత్రి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ చేపడతామని సీపీ ఆనంద్ చెప్పారు. తాగి వెహికల్ నడిపితే రూ. 10 వేలు ఫైన్ లేదా 6 నెలల జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేశారు. ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
అవి చూశాక ఎంతో బాధనిపిస్తోంది.. సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్. -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications