హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫోన్ పే షాక్: ఇక నుంచి చార్జీ వసూల్.. ఎవరికీ, ఎంత అంటే

|
Google Oneindia TeluguNews

అంతా స్మార్టే.. ఇప్పుడు ఏటీఏం కార్డు వాడటం కూడా తక్కువే.. ఎందుకంటే అంతా యూపీఐ మహిమ. అవును.. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా భారీగా నగదు బదిలీ జరుగుతుంది. అదీ కూడా ఫ్రీగా.. అవసరం ఉన్నంత అవుతుంది. దీంతో బ్యాంకులకు వెళ్లడం.. నగదు డ్రా చేసుకోవడం అనేది ఉండటం లేదు. ఇప్పటివరకు అయితే ఓకే.. అయితే దీనిని ఫోన్ పే గమనించినట్టు ఉంది. అందుకే కొందరు యూజర్లు.. కొన్ని రీ చార్జీలకు సంబంధించి చార్జీ వసూల్ చేస్తామని చెప్పి ఒకింత షాక్ ఇచ్చింది.

 అంతా ఫోన్ పే

అంతా ఫోన్ పే

దేశంలో పెద్ద యూపీఐ ప్లాట్ ఫామ్ ఫోన్ పే. ఫోన్ పే ద్వారా గ్రాసరీ స్టోర్‌లో చెల్లింపుల నుంచి మనీ ట్రాన్స్‌ఫర్, బిల్లుల చెల్లింపు వరకు పలు రకాల సేవలు పొందొచ్చు. ఫోన్ పే తన యూజర్లకు షాక్ ఇచ్చింది. ఫోన్ పే ప్రయోగాత్మకంగా ఛార్జీలు వసూలు చేస్తోంది. ఎంపిక చేసిన కొందరు కస్టమర్లు రూ.50 నుంచి రూ.100 లోపు రీఛార్జీ చేసుకుంటే 1 రూపాయి, రూ.100 కంటే ఎక్కువైతే రూ.2 ఫీజుగా వసూలు చేస్తోంది. ఇంతకాలం నిర్వహణ వ్యయం ఉన్నా ఈ సంస్థ ఉచితంగానే యూజర్లకు సేవలు అందిస్తోంది. ఖర్చులు తగ్గించుకునేందుకు ఇప్పటికే ప్రమోషన్లను సగానికి తగ్గించిన ఫోన్ పే.. తాజాగా ఈ ఛార్జీలు వసూలు అమలు చేస్తోంది.

 చార్జీ వసూల్

చార్జీ వసూల్

ఇది ప్రయోగంలో భాగం. ఎంపిక చేసిన యూజర్ల నుంచి మాత్రమే చార్జీలు వసూలు చేస్తున్నామని ఫోన్ పే ప్రతినిధి ఒకరు తెలియజేశారు. కొందరి నుంచి చార్జీలు వసూలు చేయాలా? ఎక్కువమంది నుంచి వసూలు చేయాలా? అనేది ఇంకా నిర్ణయించలేదని ఫోన్ పే ప్రతినిధి ఒకరు చెప్పారు. గతవారం ఫోన్ 44 శాతం రూ.888 కోట్ల నష్టాలబారిన పడింది. రెవెన్యూ 84 శాతానికి రూ.690 కోట్లు పెరిగింది. ఇతర అనేక ఫిన్ టెక్స్ తరహాలో యూజర్లకు ఉచితంగా సేవలు అందిస్తోంది. నిర్వహణ ఖర్చులు ఉన్నప్పటికీ ఉచితంగా సర్వీస్ చేస్తోంది. మార్కెట్‌లో షేర్ పొందేందుకు ఇదొక స్ట్రాటజీ అని అంటుంటారు.

లీడ్ రోల్

లీడ్ రోల్

యూపీఐ ప్లాట్ ఫామ్‌లో ఫోన్ ఫే లీడర్‌గా ఉంది. సెప్టెంబర్‌లో 165 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఆ తర్వాత గూగుల్ పే ఉంది. ఐపీఓ బౌండ్ పేటీఎం 9 శాతం మార్కెట్ షేర్ కలిగుంది. పీర్ టు మర్చంట్, ఇతర ట్రాన్సాక్షన్లపై ఫోకస్ పెట్టింది. క్రెడిట్ కార్డు ద్వారా ఈ వ్యాలెట్‌లోకి డబ్బు పంపుకోవాలంటే పేటీఎం ఇప్పటికే చార్జీలు వసూలు చేస్తోంది. అయితే పేమెంట్స్‌కు ఎలాంటి ప్లాట్ ఫామ్ చార్జ్ చేయడం లేదు. టెక్నాలజీ కంపెనీలు కస్టమర్లను రీటైన్ చేసుకోవడానికి ఇబ్బందులు పడక తప్పలేదు.

English summary
upi platform leader phonepe tries recharge fee on some users company person said in the statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X