Hyderabad: హైదరాబాద్‍లో డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు..
నూతన సంవత్సరం సందర్భంగా పోలీసులు నిఘా పెంచుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ వాడకంపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ డ్రగ్స్ ను కట్టడి చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేశారు. పంజాబ్‌లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
100 గ్రాముల ఎండీఎంఏ, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. న్యూఇయర్ వేళ డ్రగ్స్ విక్రయంపై పోలీసుల కఠిన చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్‌ను సేవిస్తే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు కొనుగోలు చేశారు. డ్రగ్స్ తీసుకున్నారన్న అనుమానం వస్తే అక్కడిక్కడే పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.

మూడు రోజుల క్రితం ఫిలింనగర్‌లోని పబ్ పార్కింగ్ ఏరియాలో ఒక వ్యక్తి డ్రగ్స్ అమ్ముతున్నాడనే సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దాడులు చేసి నిందితుడిని పట్టుకున్నారు. బెంగళూరుకి చెందిన ఆ వ్యక్తి పేరు బాబు కిరణ్‌గా గుర్తించారు. క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న అతడ్ని పబ్ పార్కింగ్ వద్ద రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.
శనివారం డ్రగ్స్ విక్రయిస్తున్న ఒక యువతితో పాటు మరో యువకుడిని షాద్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 11గ్రాముల ఎండీఎంఏ, రెండు సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. యాదగిరిగుట్ట ఆలేరు ప్రాంతానికి చెందిన కొండెం ప్రియాంక రెడ్డి అలియాస్ ప్రియా(29) ఆర్క్‌టెక్చర్ గా పని చేస్తున్నారు. వృత్తిపరంగా నగరానికి వలసొచ్చి, మాదాపూర్, సిలికాన్ వ్యాలీ ప్రాంతంలోని న్యూ పాష్‌ప్లేస్ గర్ల్స్ హాస్టల్‌లో ఉంటుంది. ఆమె డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు చిక్కింది.












Click it and Unblock the Notifications