Crime News: గచ్చిబౌలిలో వ్యభిచార ముఠా అరెస్ట్.. వారంతా బయటి వారే..

హైదరాబాద్ లో ఏదో ఒక చోట కొందరు వ్యభిచారం నిర్వహిస్తునే ఉన్నారు. ఎన్నిసార్లు పట్టుబడినా మళ్లీ అదే పని చేస్తున్నాడు. తాజాగా
గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని ఓయో హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఏహెచ్‌టీయూ (యాంటీ విమెన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌) అధికారులు బుధవారం దాడి చేశారు. సాయంత్రం 6.30 గంటలకు వ్యభిచార చేస్తున్నట్లు సమాచారం రావడంతో దాడి చేశారు. ఉజబెకిస్తాన్‌కు చెందిన యువతితో పాటు ఇద్దరు ఢిల్లీ, ఇద్దరు వెస్ట్‌ బెంగాల్, ఒకరు ముంబైకి చెందిన యువతులకు విముక్తి కలిగించారు.

38 కండోమ్‌ ప్యాకెట్లు
మహిళలతో వారితో పాటు విటులను అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. నిర్వాహకులు బేగంపేటకు చెందిన జితేందర్‌, పూణేకు చెందిన శ్రీకాంత్‌, గచ్చిబౌలి సరేన్‌ పార్కుకు చెందిన లక్ష్మయ్యను అదుపులోకి తీసుకున్నారు. రూ.81,900ల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్థలంలో 6సెల్‌ఫోన్లు, 38 కండోమ్‌ ప్యాకెట్లు పట్టుకున్నారు.బాధిత యువ తులను రెస్క్యూ హోంకు తరలించనున్నారు. కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు విచారణ చేపట్టారు.

Police arrested six women who were operating prostitution in Gachibowli
ఇతర రాష్ట్రాలు
యువతులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు కొందరు. ఫోన్ల ద్వారా మాట్లాడుకుని.. ఫలన చోటుకి రావాలని వారికి అడ్రస్ పెడతారు. వారు రాగానే డబ్బు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తారు. అయితే వీరు ఎప్పుడు ఒకే చోట కాకుండా ప్రాంతాలను మారుస్తూ ఉంటారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+