హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ సీఐ దేవుడిలా వెళ్లి కాపాడాడు.. కాస్త ఆలస్యమైనా.. అతని ప్రాణాలు గాల్లో కలిసేవి..

|
Google Oneindia TeluguNews

లాక్ డౌన్ వేళ నిర్మానుష్యంగా ఉన్న ఆ బ్రిడ్జి పైకి వచ్చిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. ఇంతలో అటుగా వెళ్తున్న సీఐ అతన్ని గమనించి ఆత్మహత్యను అడ్డుకున్నాడు. మంచి మాటలతో కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించాడు. వనపర్తి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా రేవల్లి మండలానికి చెందిన భాస్కర్‌కు ఆత్మకూర్ మండలం బలకిష్టపూర్ గ్రామానికి చెందిన ఓ యువతితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. గత నెల పుట్టింటికి వెళ్లిన భాస్కర్ భార్య.. లాక్ డౌన్ నేపథ్యంలో అక్కడే ఉండిపోయింది. దీంతో గురువారం ఆమెను తీసుకొచ్చేందుకు భాస్కర్ బలకిష్టపూర్ వెళ్లాడు. అయితే అతనితో వచ్చేందుకు భార్య నిరాకరించింది. దీంతో ఆమెతో గొడవపడ్డ భాస్కర్ మనస్తాపంతో వెనుదిరిగాడు.

Police rescued a man who was about to commit suicide

Recommended Video

Vijay Devarakonda Video Conference With Telangana Police | Oneindia Telugu

మార్గమధ్యలో మదనపూర్ మండలం గోపన్ పేట, కొత్తపల్లి గ్రామం వద్దనున్న బ్రిడ్జిపై నుంచి నీళ్లల్లోకి దూకి ఆత్మహత్యకు యత్నించబోయాడు. ఇంతలో అటుగా వెళ్తున్న సీఐ సీతయ్య భాస్కర్‌ను గమనించి ఆత్మహత్యను అడ్డుకున్నారు. తన వాహనంలో ఎక్కించుకుని మదనపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులను పిలిచి అప్పగించారు. సీఐ తమవాడి ప్రాణాలను కాపాడినందుకు భాస్కర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపనట్టు సమాచారం. సీఐ చాకచక్యంగా వ్యవహరించడం వల్లే భాస్కర్ ప్రాణాలు దక్కాయని చెబుతున్నారు. ఆయన కాస్త ఆలస్యంగా అటువైపు వెళ్లినా.. భాస్కర్ ప్రాణాలు దక్కకపోయేవని వాపోతున్నారు.

English summary
Madanapur CI Seethaiah rescued a man while he was about to commit suicide,incident took place in Wanaparthy district. Victim said he was upset for his wife refused to come to his house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X