హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేప్ సమయంలోనే ముక్కు, నోరు మూసి.. ఆ తర్వాత పెట్రోల్ పోసి: ప్రియాంక మృతిపై సీపీ సజ్జనార్ వివరణ

|
Google Oneindia TeluguNews

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డిని నిందితులు పథకం ప్రకారమే లైంగికదాడి చేశారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ వివరించారు. హత్య కేసులో ఏ1 మహ్మద్ అలియాస్ ఆరిఫ్ అని పేర్కొన్నారు. ఏ2 శివ, ఏ3 బొల్లు నవీన్ క్లీనర్లు ఇద్దరు ఉన్నారు. ఏ4 చెన్న కేశవులు అని పేర్కొన్నారు. విచారణకు సీసీటీవీ ఫుటేజీ హెల్ప్ అయ్యిందని పేర్కొన్నారు.

లవర్‌తో లేచిపోవచ్చు..: ఫిర్యాదు చేస్తే పోలీసుల స్పందన ఇదంటూ ప్రియాంక రెడ్డి తల్లి కన్నీరులవర్‌తో లేచిపోవచ్చు..: ఫిర్యాదు చేస్తే పోలీసుల స్పందన ఇదంటూ ప్రియాంక రెడ్డి తల్లి కన్నీరు

రంగంలోకి 10 బృందాలు

రంగంలోకి 10 బృందాలు

శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో 10 బృందాలను కేసును చేధించాయని సీపీ సజ్జనార్ వివరించారు. బుధవారం సాయంత్రం ఇంటినుంచి వెళ్లిన ప్రియాంక టోల్ ప్లాజా వద్దకొచ్చేసరికి తమతో కాంటాక్ట్ లేదని పేరెంట్స్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేశామని తెలిపారు. 28 ల్యాంకో నుంచి తమకు ఫిర్యాదు వచ్చిందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. వెంటనే తమ సిబ్బంది స్పందించి విచారణ చేపట్టారని వివరించారు.

యువతి మృతదేహం

యువతి మృతదేహం

మరునాడు 22 నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువతి కాలిపోయిందని సమాచారం వచ్చిందని తెలిపారు. అక్కడికి ప్రియాంక పేరెంట్స్ తీసుకెళ్తే గుర్తించారని పేర్కొన్నారు. అక్కడినుంచి విచారణ వేగం పెరిగిందని.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఎంక్వైరీ కొలిక్కి వచ్చిందని తెలిపారు. సాయంత్రం లారీ పక్కన స్కూటీ పార్క్ చేయడం నిందితులు చూశారని.. మళ్లి తిరిగొస్తుందని వేచి చూశారని తెలిపారు. వాహనం పంక్చర్ చేయాలని మహ్మద్‌కు.. నవీన్ ఐడియా ఇచ్చాడని సజ్జనార్ చెప్పారు. ఆమె వచ్చేలోపు వెనక టైర్‌ను మహ్మద్ పంక్చర్ చేశారని తలిపారు.

9.18 గంటలకు..

9.18 గంటలకు..

బుధవారం రాత్రి 9.18 గంటలకు తన వాహనం వద్దకు ప్రియాంక వచ్చారని సీపీ తెలిపారు. ఇంతలో మహ్మద్ కల్పించుకొని.. వాహనం పంక్చర్ అయ్యిందని చెప్పారన్నారు. ఆమె నమ్మి తన వాహనం పంక్చర్ చేయించాలని కోరగా.. శివ, నవీన్‌ను పంపించాడని తెలిపారు. వారు ఒక దగ్గర లేదని రాగా.. మరోచోటికి పంపించారని పేర్కొన్నారు. వారు రూ.10 ఇచ్చి గాలికొట్టించి తీసుకొచ్చారని సీపీ వెల్లడించారు.

Recommended Video

Vet Doctor Murder Case Solved, Four People Arrested
వెహికిల్ వచ్చిన వెంటనే

వెహికిల్ వచ్చిన వెంటనే

ఆమె వాహనం తీసుకొనే వచ్చాక లారీ వెనకాలకు ఆరిఫ్, చెన్నకేశవులు తీసుకెళ్లారని చెప్పారు. నోరుని మూసివేసి లైంగికదాడి చేశారని చెప్పారు. ఆ తర్వాత నవీన్, శివ కూడా లైంగికదాడి చేశారన్నారు. లైంగికదాడి చేసే సమయంలో ముక్కు మూయడంతో ప్రియాంకరెడ్డి చనిపోయారని తెలిపారు. తర్వాత మృతదేహాన్ని లారీలో వేసి.. మరోచోటికి తీసుకెళ్లారని.. వెనకాల నవీన్, శివ స్కూటీ మీద వచ్చారని వివరించారు.

10.30 గంటలకు..

10.30 గంటలకు..

రాత్రి 10.30 గంటలకు వారు బయల్దేరారని చెప్పారు. అలా ప్రియాంకను నిర్జీవ ప్రదేశంలో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టారని పేర్కొన్నారు. స్కూటీని కూడా 10 కిలోమీటర్ల దూరంలో వదిలివేశారని చెప్పారు. ఈ కేసును మహబూబ్ నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగిస్తున్నామని చెప్పారు. నిందితులకు ఉరిశిక్ష విధించేలా ఆధారాలు సమర్పిస్తామని సీపీ సజ్జనార్ చెప్పారు.

English summary
all four accused are arrested cyberabad cp sajjanar said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X