హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

20 నిమిషాల్లోనే అంతా అయిపోయింది.. ప్రియాంక హత్య కేసులో ..మినిట్ టు మినిట్

|
Google Oneindia TeluguNews

ప్రియాంక రెడ్డి హత్య కేసులో సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నలుగురి నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు ఏం జరిగిందని ఆయన వివరించారు. ముఖ్యంగా ప్రియాంక రెడ్డిని కేవలం ఇరవై నిమిషాల్లోనే అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసినట్టు సీపీ సజ్జనార్ తెలిపారు. హత్యకు సంబంధించిన టైమ్ లైన్‌ను ఆయన వివరించారు.

Priyanka Reddy murder: మూగ జీవాలకు చికిత్స చేసే ప్రియాంక.. మానవ మృగాలకు బలి.. పవన్ కల్యాణ్ ఎమోషనల్Priyanka Reddy murder: మూగ జీవాలకు చికిత్స చేసే ప్రియాంక.. మానవ మృగాలకు బలి.. పవన్ కల్యాణ్ ఎమోషనల్

ప్రియాంక మర్డర్ టైమ్ లైన్

ప్రియాంక మర్డర్ టైమ్ లైన్

5.50కి ప్రియాంక రెడ్డి గురువారం సాయంత్రం ఇంటి నుండి బయలు దేరింది
6.08 కి శంషాబాద్ టోల్ గేట్ వద్దకు చేరుకుంది
6.15కి టూవీలర్ పార్క్ చేసింది గచ్చిబౌలికి చేరింది.
9.13కి తిరిగి టోల్‌గేట్ వద్దకు చేరుకుంది.
9.19 కి తన సోదరికి ప్రియాంక కాల్ చేసింది.
9.23 కి శివ అనే నిందితుడు ప్రియాంక రెడ్డి స్కూటీని పక్చర్ చేయించేందుకు తీసుకువెళ్లాడు. అయితే అయిదు నిమిషాల్లోనే తిరిగి వెనక్కి వచ్చాడు.
9.28కి తిరిగి మరోసారి స్కూటీని తీసుకువెళ్లాడు.
9.35 కి తిరిగి రెండవ సారి టైర్లో గాలిని నింపుకుని వాపసు వచ్చాడు.
9.19 నుండి 9.40 వరకు ప్రియాంక తన సోదరీతో ఫోన్ మాట్లాడుతూనే ఉంది.
9.40 కి ప్రియాంక ఫోన్ స్విచ్చాఫ్ అయింది.

10.08కి అక్కడ పార్క్ చేసిన లారీ వెళ్లిపోయింది.
10.13 కి అనంతరం ఇద్దరు నిందితులు స్కూటిపై వెళ్లారు.

20 నిమిషాల్లో అత్యాచారం.. హత్య

20 నిమిషాల్లో అత్యాచారం.. హత్య

నిందితుడు శివ స్కూటీని తీసుకెళ్లడంతో అక్కడే ఫోన్ మాట్లాడుతూ వేచి ఉన్న ప్రియాంక రెడ్డిని... ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో వెంటనే ఆరీఫ్‌తో ఇతర నిందితులు పక్కనే ఉన్నా నిర్మానుష్య ప్రాంతంలోకి బలవంతంగా ఎత్తుకెళ్లారు. అనంతరం అమె అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి మూకుమ్మడిగా దారుణ అత్యాచారం చేశారు. కొద్ది సేపటికే అక్కడికి చేరుకున్న శివ సైతం అందులో భాగస్వామి అయ్యాడు. ముఖ్యంగా ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో మొత్తం ఇరవై నిమిషాల్లోనే అత్యాచారం , హత్య చేశారు. దీంతో ప్రియాంక అక్కడికక్కడే చనిపోయినట్టుగా వివరించారు. 9.40 నుండి 10.10 మధ్యలోనే అంత కర్కశంగా ఎలా వ్యవహరించారనేది విచారణలో తేలాల్సి ఉంది.

అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో శవం కాల్చివేత

అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో శవం కాల్చివేత

ప్రియాంక రెడ్డిని హత్య చేసిన దుండగులు అనంతరం ఆమె శవాన్ని దుప్పట్లో చుట్టి లారీలో వేసుకున్నారు. అక్కడ నుండి 10 .13కు బయలు దేరి వెళ్లిపోయారు. ఇక శవాన్ని నిర్మానుష్య ప్రాంతంలో తగులబెట్టేందుకు పెట్రోలు తీసుకున్న నిందితులు రాత్రీ 2 గంటల ప్రాంతంలో చటాన్‌పల్లి సమీపంలో ఉన్న వంతెన క్రింద పెట్రోల్ పోసి తగులబెట్టారు. అయితే శవాన్ని ఆనవాలు లేకుండా చేయాలనుకున్న దుండగులు కాసేపటి తర్వాత తిరిగి వెళ్లి శవం పూర్తిగా కాలిందా లేదా చూసేందుకు వెళ్లారు. శవం పూర్తిగా కాలిందని నిర్థారించుకున్న తర్వాతే అక్కడి నుండి వెళ్లి పొయినట్టు పోలీసులు వివరించారు.

Recommended Video

Vet Doctor Murder Case Solved, Four People Arrested
 ఫాస్ట్ ట్రాక్ కోర్టు...

ఫాస్ట్ ట్రాక్ కోర్టు...

కాగా ప్రియాంక హత్యకేసులో ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆందోళనలు , విమర్శలు చెలరేగుతున్నాయి. నిందితులు ఉరి తీయాలని ప్రియాంక తండ్రితో పాటు పలువురు నేతలు ప్రజా సంఘాల నేతలు పోలీసులపై ఒత్తిడి చెస్తున్నారు. దీంతో వీలైనంత త్వరగా కేసు విచారణ కొనసాగించి నిందితులను శిక్ష పడేందుకు... విచారణలో ఆలస్యం లేకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని జిల్లా న్యాయస్థానాన్ని కొరినట్టు సీపీ సజ్జనార్ తెలిపారు.

English summary
The murder of Priyanka Reddy has been revealed by CP Sajjanar. Four accused have been arrested. Explaining when and what happened.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X