హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రఘురామ: ఆస్పత్రిలోనే ట్రీట్‌మెంట్.. కమాండర్‌కు లేఖ.. బయట ఏపీ పోలీసులు..

|
Google Oneindia TeluguNews

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆర్మీ ఆస్పత్రి కమాండర్‌ లేఖ రాశారు. అందులో తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. పెయిన్‌ కిల్లర్స్‌, యాంటీ బయాటిక్స్‌ వాడుతున్నా.. తన కాలి నొప్పి ఇంకా తగ్గలేదని తెలిపారు. బీపీ కూడా హెచ్చుదల కనిపిస్తోందని చెప్పారు. నోరు కూడా తరచుగా పొడారిపోతోందని లేఖ రఘురామ పేర్కొన్నారు.

ఆస్పత్రిలోనే ఉంటా..

ఆస్పత్రిలోనే ఉంటా..


రెండు, మూడు రోజులు ఆస్పత్రిలోనే.. డాక్టర్ల పర్యవేక్షణలో తనకు చికిత్స అందించాలని కోరారు. అయినప్పటికీ డిశ్చార్జ్‌ చేయాలనుకుంటే.. డిశ్చార్జ్‌ సమ్మరీలో తన ఆరోగ్య పరిస్థితిని స్పష్టంగా తెలియజేయాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఏపీకి చెందిన కొందరు పోలీసులు ఆస్పత్రి దగ్గర ఉన్నట్లు తెలుస్తోందని లేఖలో రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

బెయిల్ మంజూరు కానీ

బెయిల్ మంజూరు కానీ


ఇటీవల రఘురామకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే అభియోగంపై సీఐడీ పోలీసులు రఘురామను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రఘురామ విడుదలలో మరింత జాప్యం జరుగుతోంది. మరో నాలుగు రోజుల వరకు వేచి ఉండక తప్పదని రఘురామ తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నారు.

డిశ్చార్జీ సమ్మరీ కావాలనడంతో

డిశ్చార్జీ సమ్మరీ కావాలనడంతో

కోర్టు ఆదేశాలతో ష్యూరిటీస్ పిటిషన్ ట్రయల్ కోర్టులో వేశామని వివరించారు. డిశ్చార్జ్ సమ్మరి కావాలని న్యాయమూర్తి అడిగారని, అయితే రఘురామ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి నాలుగు రోజులు సమయం పడుతుందన్నారు. నాలుగురోజుల తర్వాత మరోసారి సీఐడీ కోర్టులో ష్యూరిటీ పిటిషన్ వేస్తామని అన్నారు. అప్పటి వరకు బెయిల్‌పై విడుదల వీలుకాదని లక్ష్మీనారాయణ అన్నారు.

Recommended Video

Upendra : సీఎం అవ్వాలనుకుంటున్నా.. Karnataka ఎలక్షన్స్ కి Real Star సిద్దం || Oneindia Telugu
బయటకు వెళ్లాలని లేదు

బయటకు వెళ్లాలని లేదు


వాస్తవానికి రఘురామ కూడా బయటకు రావొద్దని అనుకుంటున్నారు. వస్తే మళ్లీ ఏదో పేరుతో అరెస్ట్ చేస్తారని భయం. అందుకే ఆయన ఆర్మీ కమాండర్‌కు లేఖ రాశారు. దీనిపై ఆయన స్పందించాల్సి ఉంది.

English summary
Raghu rama krishna raju writes letter to army commander on his health issue. takes treatment here only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X