జగన్ వదిలిన బాణం: మరో ప్రజా ప్రస్థాన యాత్ర, రాజన్న బిడ్డను అంటూ.. పార్టీ ఆవిర్భావం..?
జగనన్న వదిలిన బాణం అంటూ ప్రజల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల.. రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించారు. షర్మిల ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించి.. అధికార పార్టీలో గుబులు పుట్టించారు షర్మిల. ఇదివరకే పాదయాత్ర చేసినా ఆమె.. జనంతో కలిసిపోతానని, సమస్యలపై రాజీలేకుండా పోరాడుతానని స్పష్టంచేశారు. అటు ఏపీలో సోదరుడు జగన్‌తో అటు ఇటుగా ఉండగా.. తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేస్తానని ప్రకటించి వ్యుహాత్మకంగా అడుగులు వేశారు.
Recommended Video


జగన్ జైలుకెళ్లడంతో..
అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళ్లిన సందర్భంలో షర్మిల బయటకు వచ్చారు. పార్టీ వ్యవహారాలను దగ్గరుండీ మరీ పర్యవేక్షించారు. ప్రజా ప్రజా ప్రస్థాన యాత్ర చేపట్టారు. తండ్రి వైఎస్ఆర్‌ని తలపిస్తూ షర్మిల యాత్ర కొనసాగింది. 230 రోజుల్లో 3,112 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగింది. అడుగడుగునా జనం షర్మిలకు బ్రహ్మారథం పట్టారు. ప్రజా సమస్యలను షర్మిల ఆలకించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సమస్యలను తీరుస్తామని చెప్పారు. షర్మిల చేపట్టిన యాత్ర వైసీపీకి బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత జగన్ జైలు నుంచి బెయిల్ మీద రావడం.. గత ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్ర పోషించడం.. 2019 సాధారణ ఎన్నికల్లో అధికారం చేపట్టేందుకు దోహదం చేశాయి.

రాజన్న బిడ్డను అంటూ
పాదయాత్రలో తాను రాజన్న బిడ్డను అంటూ పరిచయం చేసుకున్నారు. ఆమెకు ప్రతీ చోట జనం నీరాజనం పలికారు. అవ్వ, అయ్యా, అక్క, అన్న, తమ్ముడు అందరినీ అప్యాయంగా పలకరించారు. అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబుపై విమర్శల జడివాన కురిపించారు. 3 వేలకు పైగా కిలోమీటర్లు పర్యటించి.. శభాష్ అనిపించుకున్నారు. వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్ చేయనిది షర్మిల్ చేసి చూపించారు. షర్మిల 230 రోజుల్లో 3,112 కిలో మీటర్లు ప్రయాణించగా, చంద్రబాబు 208 రోజుల్లో 2,800 కిలో మీటర్లు చేపట్టిన సంగతి తెలిసిందే.

షర్మిలను మరచి..
గత ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టింది. కానీ షర్మిలకు పదవీ రాలేదు. ఎమ్మెల్యే సీటు లేదు. రాజ్యసభ ఊసే లేదు. పార్టీలో ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. ఇక తన దారి తాను చూసుకోవాలని అనుకుంటున్నారు. ఆ మేరకు కొత్త పార్టీ ఏర్పాటు గురించి ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వాస్తవానికి తెలంగాణలో కూడా ప్రతిపక్ష పార్టీ లేకుండా పోయింది. సీఎల్పీని కూడా టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ, ఇతరులు కూడా ప్రభుత్వాన్ని ఎదురించే పరిస్థితి లేదు. షర్మిల పార్టీ ఇప్పుడు పురుడు పోసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి ప్రభావం చూపించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications