హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉపాధి హామీ పనిలో అవకతవకలు: రూల్స్‌కు విరుద్దంగా పనులు, కేంద్ర బృందం నివేదికతో..

|
Google Oneindia TeluguNews

ఉపాధి హామీ పథకం.. నిరుపేదలకు 100 రోజులు ఉపాధి కల్పించే స్కీమ్. జాబ్ కార్డు ఉన్నవారికి ఉపాధి లభిస్తోంది. దేశవ్యాప్తంగా స్కీమ్ అమలవుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో నిబంధనల మేరకు పనులు జరగడం లేదట. ఈ విషయాన్ని కేంద్ర ప్రతినిధి బృందం తెలిపింది. జూన్‌ నెలలో రాష్ట్రంలో ఈ టీమ్ పర్యటించిన సంగతి తెలిసిందే. నివేదిక రూపొంచింది కేంద్రానికి సమర్పించింది.

5 జిల్లాల్లో 12 గ్రామాల్లో పర్యటన

5 జిల్లాల్లో 12 గ్రామాల్లో పర్యటన

5 జిల్లాల్లో 12 గ్రామాల్లో నాలుగు రోజుల పాటు పర్యటించి 47 పనులను కేంద్ర బృందం పరిశీలించింది. 77 పేజీల నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలో పేర్కొన్న అంశాలపై చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతీ చెరువులో ఏటా పూడిక తీస్తున్నారని, పని జరగక ముందు ఎలా ఉండేది? జరిగిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది? అనే లెక్కలు వేయడం లేదని, దాంతో చెరువుల్లో జరిగే పూడిక పనులు అవినీతిగా భావిస్తున్నామని నివేదికలో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు చెరువు పూడిక పనులు చేయొద్దని స్పష్టంచేశారు. ఈ పనులకు సంబంధించి ఆడిటింగ్‌, విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై తక్షణ చర్యలు చేపట్టి పూర్తి నివేదికను సమర్పించాలని కోరారు.

నిధులు వసూల్

నిధులు వసూల్

పక్కదారి పట్టిన నిధులను వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంచేసింది. కామారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, జనగాం, హన్మకొండ జిల్లాల్లో జూన్‌ 9 నుంచి 12 వరకు కేంద్ర బృందం పర్యటించింది. వర్క్‌ ఆర్డర్లు ఇవ్వకుండా పనులు చేయించారని, ఉపాధి హామీ చట్టం నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్ల ద్వారా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారని గుర్తించింది. కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టిన పనుల నిధులను వెనక్కి రాబట్టాలని ఆదేశించింది. గ్రామాల్లో కల్లాల ఏర్పాటు, మొక్కలకు ట్రీ గార్డుల ఏర్పాటు ఉపాధి హామీ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ఎవరి అనుమతితో ఈ పనులు చేపట్టారో చెప్పాలని నిలదీసింది. ఆ పనులకు ఖర్చు చేసిన మొత్తాన్ని అధికారుల నుంచి తీయాలని ఆదేశించింది.

నిబంధనలకు విరుద్దం

నిబంధనలకు విరుద్దం


సీసీరోడ్లు, రోడ్డు పక్కన నాటిన మొక్కలు, వైకుంఠ ధామాలు, హార్టికల్చర్‌ ప్లాంటేషన్లు, చెరువుల పూడికతీత, నర్సరీలు, కంపోస్టు తయారీ, పంచాయతీ భవనాల నిర్మాణాలు, ధాన్యం ఆరబోసే కల్లాల నిర్మాణాలు తదితర పనులను ఉపాధి హామీ పథకం కింద చేపట్టినట్లు గుర్తించారు. వీటిలో చాలావరకు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టినట్లు తేల్చింది. ఆ మేరకు నివేదిక ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం నిధుల రికవరీకి ఆదేశించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే అంశమే. ఇప్పటికే ధాన్యం సేకరణ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉప్పు నిప్పు పరిస్థితి నెలకొంది.

ఇక్కడ ఇలా

ఇక్కడ ఇలా

కామారెడ్డి జిల్లా ఐలాపూర్‌ ఊర చెరువును పలుమార్లు తవ్వారు. నాలుగు ముక్కలుగా ప్రతిపాదనలు చేశారు. 2020-21లో ఏకకాలంలో మూడు ముక్కల పనులు చేయించారు. కింది స్థాయిలోనే ఆమోదం పొందేందుకు పనిని మూడు ముక్కలు చేసి, రూ.30.96 లక్షలు ఖర్చు చేశారు. నాలుగు ముక్కలకు కలిపి 40.89 లక్షలు చెల్లించారు. నిధుల్లో 60 శాతం కూలీల వేతనాలకు, 40 శాతం మెటీరియల్‌కు ఖర్చు చేసి పథకం ఉద్దేశాన్ని పక్కదారి పట్టించారని అధికారులు తేల్చారు. ఆ గ్రామంలో మొక్కలు నాటడం, ట్రీ గార్డుల ఏర్పాటుకు వెచ్చించిన రూ.4.25 లక్షలను తిరిగి చెల్లించాలని ఆదేశించారు. మాచరెడ్డిలో గుట్టలపై కాకుండా మైదాన ప్రాంతాల్లో కందకాలు తవ్వి నిధులు వృథా చేశారని, రూ.34.11 లక్షలు రికవరీ చేయాలని, సంబంధిత అధికారిపై చర్యలు చేపట్టాలని నిర్దేశించారు.

English summary
rules against MGNREGA work done at telangana districts. committee report to union government. central government serious on this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X