ఉత్తమ్‌ను దించాలని అప్పట్లో లేఖలు, పీసీసీ చీఫ్ పదవీపై తీరని జగ్గారెడ్డి ఆశ
ఫైర్ బ్రాండ్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఫైరయ్యారు. పీసీసీ చీఫ్‌గా ఉన్నవారు..ఎప్పుడూ అందుబాటులో ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. తనకు నాన్చడం తెలియదని.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతానని పేర్కొన్నారు. కానీ కొందరు కావాలనే రచ్చ చేస్తారని మండిపడ్డారు.

పదవుల కోసం..
రాజకీయ పార్టీలో పదవుల కోసం పాకులాడటం సహజమే కదా అనే అర్థం ఇచ్చేలా మాట్లాడారు. ప్రధాని పోస్ట్ నుంచి మోడీ దిగి పోతే.. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని చూస్తాం కదా అని ఉదహరణ కూడా ఇచ్చారు. ఉత్తమ్‌ను దించాలని అనలేదా.. రేవంత్ అభిమాన సంఘాలు లేఖలు రాయలేదా అని అడిగారు. రేవంత్‌ను దించమని తాము అడగడం లేదన్నారు. ఎన్నికలు పూర్తయ్యాకే కదా ఫలితం వచ్చేది.. అలాగే తాము సహకరించడం లేదంటే రేవత్ ఫెయిల్ అయ్యినట్టేనని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ అందరిదీ అని కుండబద్దలు కొట్టారు. ఏ ఒక్కరిదో కాదని తేల్చిచెప్పారు.

సమిష్టి నిర్ణయాలు
అంతా కలిసి పనిచేయాలని.. నిర్ణయాలు కూడా సమిష్టిగా తీసుకోవాలని సూచించారు. ఏకపక్ష నిర్ణయాలు ఎప్పటికీ మంచిది కాదన్నారు. ఉత్తమ్, తాను చిన్న పిల్లలమా ఏదైనా చెబితే వినడానికి అని అడిగారు. ఉత్తమ్‌ను కలుపుకొని మరీ కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందని.. ఏదైనా కలిసి చెప్పడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అలా తాము కూడా పార్టీ మంచి కోసం సలహాలు, సూచనలు చేస్తామని అంటున్నారు.

మెట్రో కావాలి
మెట్రోను సంగారెడ్డి వరకు పొడిగించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం హయాంలో మెట్రో వచ్చిందని తెలిపారు. దానిని పొడగించాలని అడుగుతున్న పట్టించుకోవడం లేదన్నారు. ఇదే విషయం అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను అడుగుతా అని తెలిపారు. చాలా కంపెనీల్లో పనిచేసేవారు సంగారెడ్డిలో ఉన్నారని తెలిపారు. అందుకోసమే.. సర్వీస్ ఇవ్వాలని అంటున్నారు. ఇదే విషయమై కేటీఆర్‌కు లేఖ రాస్తానని వివరించారు. హైదరాబాద్ సంగారెడ్డి ఫోర్వే లైన్ బిజీగా ఉందని.. అందుకే మెట్రో కంపల్సరీగా కావాలని అడిగారు.












Click it and Unblock the Notifications