సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ ఎన్నికలకు నోటిఫికేషన్: ఏప్రిల్ 30న ఎన్నికలు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించనున్నారు.

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదలైంది. సికింద్రాబాద్ తోపాటు మొత్తం 57 కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు నోటిఫికేషన్ రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి రాకేష్ మిట్టల్ విడుదల చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించనున్నారు.
కంటోన్మెంట్ పరిధిలోని 8 వార్డులు ఉన్నాయి.

ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాపై బోర్డు అధికార యంత్రాంగం కసరత్తు ఇప్పటికే ప్రారంభించినట్లు సమాచారం. 2015లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగాయి. ఆ ఏడాది ఫిబ్రవరి 10న పాలకవర్గం కొలువుదీరింది. 2020 ఫిబ్రవరి 10 నాటికి పాలకవర్గం గడువు ముగిసింది.

 secunderabad cantonment board elections will be held on april 30

అనంతరం కేంద్రం నామినేటెడ్ సభ్యుడిని నియమించింది. అయితే, బోర్డుకు ఎన్నికలు నిర్వహించాలని పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీనిపై స్పందించాలని న్యాయస్థానాలు కూడా కంటోన్మెంట్ బోర్డును ఆదేశించాయి.

ఈ క్రమంలోనే కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేసేందుకు గానూ విధి విధానాలపై కొన్ని రోజుల కిందట కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విలీన ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో తాజాగా బోర్డు ఎన్నికల అంశం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+