శంషాబాద్ బాధితురాలి పేరును దిశగా మార్చిన పోలీసులు
శంషాబాద్ బాదితురాలి పేరును పోలీసులు మార్చారు. ఆమె పేరును మార్చేందుకు బాధితురాలి తల్లిదండ్రులు కూడ ఒప్పించారు. గత రెండు రోజులుగా అమె పేరుతో పాటు ఫోటోలు మీడియాతో పాటు సోషల్ మీడియాలో మార్మోగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాధితురాలి పేరును జస్టీస్ ఫర్ దిశగా మార్చుతున్నట్టు చెప్పారు. మీడియా సంస్థలు ,ఇతర సోషల్ మీడియా సంస్థలు కూడ ఆమె పేరును రాయకూడదని సూచించారు. అమె అసలు పేరును ఫోటోలను వాడద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు.
గత శుక్రవారం శంషాబాద్‌లో యువ వెటర్నిటి వైద్యురాలిపై నలుగురు కిరాతకులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. అనంతం ఆమె బాడి కూడ లభించకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. దేశవ్యాప్తంగా పార్టీల నేతలు, ప్రజలు, ప్రజా సంఘాలు, యువత రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు.

కాగా గతంలో ఢిల్లిలో సంచలనం రేపిన యువతి కేసులో కూడ నిర్భయగా పేరు మార్చారు. ఆ పేరుతోనే చట్టాన్ని కూడ తీసుకువచ్చారు. కాగా బాధితురాలి తల్లిదండ్రుల వివరాలను కూడ గోప్యంగా ఉంచాలని సీపీ కోరారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications