తలసానికి అవకాశం ఇవ్వని షర్మిళ.!నిరాశగా వెనుతిరిగిన మంత్రి.!అంబేద్కర్ విగ్రహం వద్ద తమషా ఘటన.!
హైదరాబాద్ : రాజ్యంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతి రోజున లిబర్టీ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వివిధ పార్టీల నేతలు పోటీ పడ్డారు. ఉదయం అంబేడ్కర్ విగ్రహం వద్దకు తమతమ అనుచరులతో చేరుకున్న నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజకీయ నేతలే కాకుండా అనేక దళిత సంఘాల నేతలు, కుల సంఘాల పెద్దలు, యువజన నేతలు, మహిళా సంఘాల నాయకురాళ్లు అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. అంతే కాకుండా బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్, జనసమితి అద్యక్షుడు కోదండ రాం, సీపిఐ, సీపీఎం పార్టీలకు చెందిన నేతలు కూడా అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు.
అరుదైన సంఘటన.. మంత్రిని వెనక్కు పంపిన షర్మిళ
ఇంతవరకూ బాగానే ఎన్నప్పటికీ ఉన్నట్టుండి ఓ అరుదైన సంఘటన అంబేడ్కర్ విగ్రహం వద్ద చోటుచేసుకుంది. వైయస్సార్ టీపి అధినేత్రి వైయస్ షర్మిళ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు అదే ప్రాంగణానికి తన అనుచరులతో చేరుకున్నారు. అంబేడ్కర్ విగ్రహం పైన కొంత మంది ఇతర నేతలు నివాళులు అర్పిస్తుండంతో షర్మిళ వేచి చూస్తున్నారు. అప్పుడే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మోత్కుపల్లి నర్సింహులుతో పాటు ఇతర ముఖ్య నేతలు అక్కడకు చేరుకున్నారు.

తలసాని సంయమనం.. షర్మిల తర్వాత నివాళి అర్పించిన మంత్రి..
అప్పటికే షర్మిళ అక్కడ వేచి చూస్తున్నప్పటికి ఆవిడను పక్కకు జరగాలని చెప్తూ తలసాని భద్రతా సిబ్బంది ముందుకు వెళ్లే ప్రయత్నం చేసారు. షర్మిళ వాళ్లని ఆపుతూ నేనున్నాను ఇక్కడ, నా తర్వాత మీ మంత్రిని తీసుకెళ్లండని వారించారు. అది విన్న తలసాని చాలా హుందాగా అక్కడ నుండి నిష్క్రమించారు. ఆ తర్వాత చాలా సేపటికి అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించి వెళ్లిపోయారు. దీంతో షర్మిళ మంత్రి తలసానికి కూడా అవకాశం ఇవ్వలేదని అక్కడే ఉన్న ఇతర పార్టీల నేతలు గుసగుసలాడుకున్న సందర్బం కనిపించింది.












Click it and Unblock the Notifications