Special Trains: శుభవార్త చెప్పిన రైల్వే.. 10 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటన..

రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త చెప్పింది. పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు పేర్కొంది. 2024 పండుగ సీజన్‌లో 854 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. గత ఏడాది 626 రైళ్లతో పోలిస్తే ఇప్పుడు చాలా పెంచినట్లు వివరించింది. దీపావళి, దసరా చట్ పూజ పండుగల తర్వాత తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే 10 రైళ్లను ప్రకటించింది. ఇందులో రైలు నంబర్ 07653 కాచిగూడ నుంచి తిరుపతికి నడపనుంది.

ఈ రైలు రాత్రి 10:30 గంటలకు తిరుపతికి బయలుదేరుతుంది. రైలు నంబర్ 07042 తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు రాత్రి 7:50 గంటలకు బయలుదేరుతుంది. రైలు నంబర్ 07446 లింగంపల్లి నుంచి కాకినాడకు నడపనున్నారు. ఈ రైలు రాత్రి 7:10 గంటలకు బయలుదేరుతుంది. రైలు నంబర్ 07336 మాగోరు నుంచి బెల్గాంకు మధ్యాహ్నం 3:40 గంటలకు బయలుదేరుతుంది. రైలు నంబర్ 05294 సికింద్రాబాద్ నుంచి ముజఫర్‌పూర్‌కు తెల్లవారుజామున 3:55 గంటలకు బయలుదేరిందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

South Central Railway has announced to run 10 special trains on the occasion of the festival

రైలు నంబర్ 07021 సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌కు ఉదయం 8:45 గంటలకు బయలుదేరనుంది. రైలు నంబర్ 07021 కాచిగూడ నుంచి హిసార్ వరకు సాయంత్రం 4:00 గంటలకు బయలుదేరుతుంది. రైలు నంబర్ 07021 సికింద్రాబాద్-విశాఖపట్నం నుంచి రాత్రి 7:40 గంటలకు వెళ్లనుంది. రైలు నంబర్ 03429 సికింద్రాబాద్ నుంచి మాల్దా పట్టణానికి సాయంత్రం 4:35 గంటలకు వెళ్తుంది. రైలు నంబర్ 01437 షోలాపూర్ నుంచి తిరుపతికి రాత్రి 9:40 గంటలకు బయలుదేరుతుంది. అయ్యప్ప భక్తుల కోసం కూడా రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

నవంబర్ మొదటి వారం నుంచి నంద్యాల మీదుగా శబరిమలకు నాలుగు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. రైల్వే శాఖ భారత్ గౌరవ్ పేరుతో శబరిమలకు ప్రత్యేక రైలును నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ రైలు నవంబర్ 16న సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. 20వ తేదీన తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+