హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో.. కుర్రొళ్లు మాములు కాదు, సీఎం కాన్వాయ్‌కే ఎదురెళ్లి.. ఆ బైక్ కూడా

|
Google Oneindia TeluguNews

సీఎం కాన్వాయ్ వెళ్లే రూట్ ముందే ప్లాన్ చేస్తారు. ట్రాఫిక్ క్లియర్ చేసి.. పంపిస్తారు. ఇతర వాహనాలు నిషిద్దం. వేరే వాహనాలు/ టూ వీలర్స్ వస్తే అంతే సంగతులు. వారికి దెబ్బలు పడటం ఖాయం.. వాహనం కూడా సీజ్ చేస్తారు. నిన్న ఓ ఇద్దరు టీనెజర్స్ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కు ఎదురెళ్లారు. పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. చివరికీ వారిని పట్టుకున్నారు. వాహనాలు సీజ్ చేశారు. కానీ కాసేపు పోలీసుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు.

కాన్వాయ్‌కు ఎదురెళ్లి..

కాన్వాయ్‌కు ఎదురెళ్లి..

తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కు బైక్‌పై ఎదురెళ్లి హడలెత్తించారు ఇద్దరు టీనేజర్లు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. నిన్న సాయంత్రం సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించి వస్తుండగా.. ఎన్టీఆర్ మార్గ్‌లో ఘటన జరిగింది. 11, 14 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు బాలలు బైక్‌పై రాంగ్‌రూట్‌లో దూసుకుకొచ్చారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కు ఎదురెళ్లారు. వెంటనే అప్రమత్తమయిన పోలీసులు పట్టుకొని.. స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు.

ఇద్దరు టీనెజర్లే..

ఇద్దరు టీనెజర్లే..

బాలురిలో ఒకరిది శాస్త్రిపురం, మరొకరు నిలోఫర్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. వారు ఆ బైక్‌ను రెండు వేల రూపాయలకు కొనుగోలు చేసి దానిపై తొలుత చార్మినార్‌కు వెళ్లారు. ఆ తర్వాత నెక్లెస్ రోడ్డువైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వారు నడిపిన బైక్ చోరీకి గురైనట్టు నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదైంది. చిన్నారులకు వాహనం అమ్మిన వారి కోసం ఆరా తీస్తున్నారు పోలీసులు. బాలల తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.

దొంగిలించిన బైక్

దొంగిలించిన బైక్

టీనెజర్ల బైక్ దొంగిలించిందని తేలింది. అందుకోసమే వారు కేవలం రూ.2 వేలకు కొనుగోలు చేశారు. ఏం చక్కా తిరుగుతున్నారు. కానీ కేసీఆర్ కాన్వాయ్‌కు ఎదురెళ్లి పట్టుబడ్డారు. లేదంటే వారిద్దరూ అలానే తిరిగేవారు. వారిద్దరికీ లైసెన్స్ కూడా లేదు. చిన్న వయసులోనే బైక్ ఇచ్చి.. పంపిస్తోన్నారా అని పేరంట్స్‌ను అడుగుతున్నారు. పిల్లలతోపాటు వారికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు.

ఆంక్షలు.. కానీ

ఆంక్షలు.. కానీ

వాస్తవానికి సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ట్రాఫిక్ పోలీసులు సమన్వయం చేసుకొని.. సీఎంను పంపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో మాత్రం అలా ఉండేది కాదు. తన కోసం వాహనాలను ఆపొద్దు అని ఆయన పలుమార్లు చెప్పారు. కానీ పోలీసులు మాత్రం.. ట్రాఫిక్ నిలిపివేశారు. దీనిపై అప్పట్లోనే వైఎస్ఆర్ చాలా సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం సీఎం, ఇతర ప్రముఖులు వచ్చిన సందర్భంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

English summary
two Teenagers ride bike wrong route at hyderabad necklace road. as cm kcr convoy comes that time. bike seized by police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X