6 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం.. పోడు రైతులకు అండగా ఉంటాం: సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఆరు బిల్లులకు శాసనసభ ఆమోద ముద్ర వేసింది. గ్రామాల సరిహద్దుల మార్పులు, పేర్ల మార్పులు.. కొత్త గ్రామాల ఏర్పాటు దిశగా.. ప్రభుత్వం కీలక ప్రతిపాదనలను సభ ఆమోదించింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018కి సవరణలు ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం.. గ్రామాల పేర్లు, సరిహద్దులు మార్చాలన్నా.. చట్టంలోని నిబంధనల ప్రకారం శాసనసభ కనీసం నెల రోజులపాటు సమావేశం కావాల్సి ఉంటుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్ తెలిపారు.

పేర్ల మార్పు..
కాలయాపన తగ్గించేందుకే తాజా ప్రతిపాదనలు తీసుకొచ్చామని చెప్పారు. ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ పక్షాలు తమ అభిప్రాయాలు వివరించాయి. కొత్త గ్రామాల ఏర్పాటు, ఉన్న గ్రామాల సరిహద్దుల మార్పు, విస్తరణపై ఎలాంటి అభ్యంతరం లేదని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. దశాబ్దాలపాటుగా గ్రామాలకు ఉన్న పేర్లను మారుస్తామంటే కుదరదని చెప్పారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ వంటి పట్టణాల పేర్లు కూడా మారుస్తారేమే.. అని అనుమానం వ్యక్తం చేశారు. పేర్ల మార్పు వంటి ప్రతిపాదన మినహా ఇతర విషయాలపై అభ్యంతరం లేదని.. ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించాలని అక్బరుద్దీన్ కోరారు.

బీజేపీ మద్దతు.. కాంగ్రెస్ సందేహాం
సవరణకు బీజేపీ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ చెప్పారు. మెదక్‌లో గతంలో ఉన్న తెలంగాణ పురం గ్రామాన్ని తెల్లాపూర్‌గా మార్చారని.. సంగారెడ్డి సమీపంలో ఉన్న ఈశ్వరాపురం గ్రామాన్ని ఇస్మాయిల్ పేటగా మార్చారని అన్నారు. చరిత్రను వక్రీకరించకుండా పాత పేర్లను మళ్లీ పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు తెలుపుతున్నామని వివరించారు. కాంగ్రెస్ కూడా ఎంఐఎం మాదిరిగా వాదనను వినిపించింది. కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తున్న పేర్లను మారిస్తే.. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను మార్చాలని కోరారు. అసలు నెల రోజుల పాటు గ్రామాల పేర్ల మార్పు ప్రక్రియ జరిగితే ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు.

ఏం జరుగుతుందటే..
ప్రభుత్వ ఉద్దేశాన్ని మరోసారి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి, శాసనసభ వ్యవహారాల మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. గ్రామాల పేర్ల మార్పు విషయంలో ప్రస్తుత చట్టాన్ని అనుసరిస్తే.. ప్రక్రియ పూర్తికి నెలకుపైగా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అందుకే ప్రతిపాదన తెచ్చామన్నారు. ఎలాంటి చర్చ జరక్కుండానే.. పేర్లు మార్చేందుకు అవకాశాలు ఏర్పడతాయని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ మరోసారి అభ్యంతరం చెప్పారు. గ్రామసభలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపిన తర్వాతే.. ప్రక్రియ మొదలవుతుందని.. శాసనసభలో పూర్తి స్థాయిలో చర్చ జరిగాకే పేర్ల మార్పు ఉంటుందని.. మంత్రి నిరంజన్ రెడ్డి ఎంఐఎంకు స్పష్టం చేశారు. తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి... సభలో బిల్లును పాస్ చేశారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లుతోపాటు తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు 2021, తెలంగాణ స్టేట్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ప్రాక్టీస్ అగైనెస్ట్ టూరిస్ట్ అండ్ ట్రావెలర్స్ బిల్ 2021,తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ బిల్లు 2021, కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ హార్టికల్చర్ యూనివర్శిటీ సవరణ బిల్లు, ది నేషనల్ అకాడెమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసర్చ్ యూనివర్శిటీ బిల్లు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది.

రైతులకు రక్షణ
ఇటు రాష్ట్రంలో గల పోడు రైతులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం ప్రభుత్వంతో కొట్లాడి వారికి న్యాయం చేయాల్సి వుందన్నారు. పోడు రైతులపై అటవీ అధికారులు దాడులు చేయొద్దని చెప్పారు. తాత, తండ్రుల నుంచి అనాధిగా అడవుల్లో ఉన్నవారిని అక్కడ నుంచి తీసివేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. జీవనోపాధిపై దెబ్బ కొట్టడం కూడా కరెక్టు కాదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మూడు లక్షలు కాకుండా మరో ఆరు లేదా ఏడు లక్షల ఎకరాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్నట్లు సమాచారం వస్తుందన్నారు.

10 లక్షల ఎకరాలు
గిరిజనులకు మొత్తం కలిపి 10 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చి అక్కడికి స్టాప్ చేసి, నో ఫర్దర్ ఎన్ క్రోచ్ చెబుదామని తెలిపారు. ఈ ప్రతిపాదనను కేంద్రం దగ్గరికి తీసుకెళ్తే వారు కూడా అంగీకరించే అవకాశం ఉంటుందన్నారు. వీలైతే ఈ సమావేశాల్లోనే తీర్మానం చేసి కేంద్రానికి కేంద్రానికి పంపిద్దామని చెప్పారు. గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఛత్తీస్ ఘడ్ నుంచి గుత్తికోయలు తెలంగాణలోకి వస్తున్నారని తెలిపారు. గుత్తికోయలు, మరొకరు కావొచ్చు వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి వచ్చి అడవులను ఆక్రమించి ధ్వంసం చేస్తే మళ్లీ ఇబ్బందులు వస్తాయని చెప్పారు.
Recommended Video

రైతు బంధు కూడా
రాష్ట్రంలో 96 వేల 676 మంది గిరిజనులకు 3.8 లక్షల ఎకరాలు ఆర్ఓఎఫ్ ఆర్ పట్టాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రైతు బంధు ప్రారంభించిన సమయంలో వీరికి రైతు బంధు వచ్చేది కాదన్నారు. గిరిజన ఎమ్మెల్యేలు తనను రిక్వెస్ట్ చేస్తే వారిని పరిగణనలోకి తీసుకుని రైతు బంధు అమలు వర్తింప చేస్తున్నామని చెప్పారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలన్నారు. సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇచ్చిన 3 లక్షల 8 వేల ఎకరాల ఆర్ఓఎఫ్ ఆర్ కాకుండా ఎంత భూమి పోడు వ్యవసాయం చేస్తున్నారనే లెక్క తేల్చితే అక్కడి స్టాప్ చేసి వారికి ఆర్ఓఎఫ్ ఆర్ పట్టాలు ఇచ్చి రైతు బంధు అమలు చేస్తే సమస్య సమిసి పోతుందన్నారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications