హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం షాక్ -క్వారంటైన్‌లో ఉండాల్సిందే -మెగాస్టార్ తొందరపడ్డారా?

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి నియంత్రణ చర్యలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున అనధికార బ్రాండ్ అంబాజిడర్ గా కొనసాగుతోన్న మెగాస్టార్ చిరంజీవికి ఝలక్ తగిలింది. తొలుత తనకు కరోనా సోకిందని, లక్షణాలు లేవని గత వారంలో ప్రకటించిన చిరంజీవి, ఆపై తప్పుడు ఫలితం వచ్చిందని, తనకు కరోనా సోకలేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దీపావళి వేడుకలోనూ చిరు పాల్గొన్నారు. కానీ నిబంధనల ప్రకారం ఆయన క్వారంటైన్ లో ఉండాల్సిందేనని అధికారులు పేర్కొన్నారు.

Recommended Video

Telangana : కరోనా నెగటివ్ వచ్చినా క్వారంటైన్ లోనే ఉండాలి.. చిరు కి తెలంగాణ సర్కార్ సూచన!

బీహార్ కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ -'చిరుత' హీరోయిన్ తండ్రి అజిత్ శర్మకు కీలక పదవిబీహార్ కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ -'చిరుత' హీరోయిన్ తండ్రి అజిత్ శర్మకు కీలక పదవి

ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం..

ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం..

ఒకసారి కరోనా పాజిటివ్ గా తేలి, ఆపై నెగటివ్ వచ్చినా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) నిబంధనల ప్రకారం, సదరు వ్యక్తులు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రం నుంచి అందుతున్న సంకేతాల మేరకు జనవరి లేదా ఫిబ్రవరిలో హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అదే సమయంలో చిరంజీవికి కరోనా విషయంలో నెలకొన్న గందరగోళంపై విలేకరులు అడిన ప్రశ్నలకు ఆయన స్పష్టత ఇచ్చారు.

క్వారంటైన‌లో ఉండాల్సిందే..

క్వారంటైన‌లో ఉండాల్సిందే..

‘‘ఏ కరోనా పరీక్ష కూడా నూటికి నూరు శాతం కచ్చితత్వంతో రాదు. ఒకసారి పరీక్షలో పాజిటివ్ వస్తే, పాజిటివ్ గానే భావించాల్సి వుంటుంది. ఆ తరువాత నెగటివ్ వచ్చినా, లక్షణాలు ఉన్నా, లేకున్నా, వ్యక్తులు అందరూ క్వారంటైన్ లో ఉండి స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా అందరికీ మేలు జరుగుతుంది. ఐసీఎంఆర్ నిబంధనల్లోనూ ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలు భౌతికదూరం పాటిస్తూ, మాస్క్ ధరిస్తేనే కరోనాకు దూరంగా ఉండొచ్చు'' అని వైద్య అధికారి పేర్కొన్నారు. అంతకుముందు..

టీడీపీలో విషాదం: తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా కన్నుమూత -కరోనా నుంచి కోలుకున్నా..టీడీపీలో విషాదం: తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా కన్నుమూత -కరోనా నుంచి కోలుకున్నా..

కరోనా ఆడేసుకుందన్న చిరు..

కరోనా ఆడేసుకుందన్న చిరు..

తనకు కొవిడ్-19 వ్యాధి సోకిందో, లేదో అనే గందరగోళంపై మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రకటన చేశారు. ‘‘కాలం, కరోనా గత నాలుగు రోజులుగా నన్ను కన్ఫ్యూజ్ చేసి.. నాతో ఆడేసుకున్నాయి. ఆదివారం టెస్టులో పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత బేసిక్ మెడికేషన్ స్టార్ట్ చేశాను. రెండు రోజులైనా ఎక్కడా ఎలాంటి లక్షణాలు లేకపోయేసరికి, నాకే అనుమానం వచ్చి, అపోలో డాక్టర్లను అప్రోచ్ అయ్యాను. వాళ్లు అక్కడ సీటీ స్కాన్ తీసి చెస్ట్‌లో ఎలాంటి ట్రేస్స్ లేవని నిర్ధారణకు వచ్చారు. అక్కడ రిజల్ట్ నెగటివ్ వచ్చాక, మరోసారి, మరో చోట నివృత్తి చేసుకుందామని నేను Tenet Labలో మూడు రకాల కిట్స్‌తో టెస్ట్ కూడా చేయించాను. అక్కడా నెగటివ్ వచ్చింది. ఫైనల్‌గా ఆదివారం నాకు పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చిన చోట కూడా RT-PCR టెస్ట్ చేయించాను. అక్కడ కూడా నెగటివ్ వచ్చింది. ఈ మూడు రిపోర్టుల తర్వాత మొదటి రిపోర్ట్ faulty కిట్ వల్ల వచ్చిందని డాక్టర్స్ నిర్ధారణకు వచ్చారు. ఈ సమయంలో మీరందరూ నాపై చూపించిన అభిమానానికి, చేసిన పూజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని పేర్కొన్నారు.

మెగాస్టార్ తొందరపడ్డారా?

మెగాస్టార్ తొందరపడ్డారా?

కరోనా లాంటి ప్రణాంతక వైరస్ విషయం చిన్న చిన్న పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న సంగతి ఆమధ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విషయంలో తీవ్ర చర్చనీయాంశం అయిది. కొవిడ్-19పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలంగాణ ఆరోగ్య శాఖ కోసం చిరంజీవి ప్రకటనలు కూడా చేశారు. అలాంటిది ఆయనే, క్వారంటైన్ నిబంధనలను పాటించకపోవడం, వైరస్ సోకలేదనే నిర్ధారణ తర్వాత వేడుకల్లో పాల్గొనడం తొందరపాటేమో అనే వాదన వినిపిస్తోంది. దీపావళి సందర్భంగా చరు తన భార్య సురేఖతో కలిసి వెటరన్ దర్శకుడు కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరు శుభలేఖ, ఆపద్భాంధవుడు, స్వయంకృషి వంటి సినిమాలు చూశారు.

English summary
Telangana Medical Health Department Director Dr. Srinivasa Rao suggested that even though person get negative to covid-19, they should be in quarantine for 14 days according to ICMR rules. Telangana authorities have pointed this out in the case of megastar Chiranjeevi being infected with covid-19. chiranjeevi along with his wife met director k.vishwanath on diwali.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X