హై కోర్టు నో: సాగర్‌లో నిమజ్జనంపై ధర్మాసనం.. ఇదివరకు ఆదేశాలే పాటించాలని..
హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. వినాయక నిమజ్జనానికి సంబంధించి రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అంగీకరించలేదు. ఇదివరకు చెప్పినట్టు సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని స్పష్టంచేసింది. ఈ ఒక్క ఏడాది అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను మాత్రం ప్రత్యేక కుంటలు ఏర్పాటు చేసి నిమజ్జనం చేయాలని స్పష్టంచేశాయి.

48 గంటల్లో క్లీన్.. కానీ
నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని ఆదివారం తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జానికి ఈ సారికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కూడా అనుమతి ఇవ్వాలని కోరింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిమజ్జనం చేసిన 48 గంటల్లోనే క్లీన్ చేస్తున్నామని.. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈసారికి అనుమతివ్వాలని కోరింది. హుస్సేస్ సాగర్ లో అన్ని విగ్రహాల నిమజ్జానికి అనుమతివ్వాలని కోరింది. ఇప్పటికిప్పుడు బేబీపాండ్స్ ఏర్పాటు సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. వినాయక నిమజ్జనంపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేలా ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి అనుమతి నిరాకరిస్తామని ప్రభుత్వానికి సూచించింది. ప్రత్యేక కుంటలు ఏర్పాటు చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయాలని హైకోర్టు తెలిపింది.

బకెట్ నిమజ్జనం
హుస్సేన్‌సాగర్‌లో రబ్బరు డ్యాంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి తెలిపింది. దూరప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు ఒకే రోజు కాకుండా ప్రణాళిక ప్రకారం అనుమతించాలని పోలీసులకు సూచించింది. చిన్న విగ్రహాలను ఇళ్లలోనే బకెట్లలో నిమజ్జనం చేయాలనీ ప్రజలకు సూచించింది. నిమజ్జన ప్రాంతాల్లో కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు పంపిణి చేయాలనీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యావరణ హిత విగ్రహాలను ప్రోత్సహించాలని తెలిపింది. వాహనదారులకు ఇబ్బంది కలుగకుండా మండపాల ఏర్పాటు చేయాలని సూచించింది. రోడ్డుకు అడ్డంగా మండపాలు ఏర్పాటు చేయరాదని హెచ్చరించింది. మండపాల దగ్గర ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలని తెలిపింది. ఆన్‌లైన్, సామాజిక మాధ్యమాల ద్వారా దర్శనాలను ప్రోత్సహించాలని తెలిపింది. రాత్రి 10 తర్వాత మైకులను అనుమతించొద్దని వెల్లడించింది. వినాయక మండపాల వద్ద శానిటైజర్లు ఉంచాలని తెలిపింది.
Recommended Video

9 రోజులు పూజలు
వినాయక చవితి సందర్భంగా 9 రోజులు ఆ గణనాథుడిని పూజిస్తుంటాం. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం రంగుల గణేశ ప్రతిమలను వాడొద్దను పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. అలాగే తక్కువ ఎత్తు గల విగ్రహాలను పూజించాలని కోరారు. కానీ కొందరు మాత్రం పెడచెవిన పెడుతూనే ఉన్నారు. ఎప్పటిలాగే పెద్ద పెద్ద.. రంగు రంగుల విగ్రహాలను వాడుతున్నారు. దీనిపై కొందరు పర్యావరణ వేత్తలు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ మేరకు ధర్మాసనం స్పందించింది. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా ఇలా కోర్టు తీర్పు చెప్పింది. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరడంతో.. ఎక్స్ డెంట్ చేస్తూ వస్తోంది. ఈ సారి కూడా తమకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ సర్కార్ కోరింది. కానీ హైకోర్టు ఈ సారి మాత్రం నిరాకరించింది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications