తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్.. అందరూ పాస్..
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిజల్ట్స్ విడుదల చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. https://results.cgg.gov.inలో ఫలితాలు చూడొచ్చని అధికారులు తెలిపారు. 4,55,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులను కేటాయించారు. సెకండియర్‌లో ప్రాక్టికల్స్‌కు 100 శాతం మార్కులు కేటాయించగా, ఫెయిల్ అయిన విద్యార్థులకు 35 శాతం మార్కులు వేశారు. 1,76,719 మంది విద్యార్థులకు ఎ-గ్రేడ్, 1,04,886 మంది విద్యార్థులకు బి-గ్రేడ్, 61,887 మంది విద్యార్థులకు సి-గ్రేడ్, 1,08,093 మంది విద్యార్థులకు డి-గ్రేడ్ కేటాయించారు.

ఫస్ట్ ఇయర్ సంబంధిత సబ్జెక్ట్‌లో వచ్చిన మార్కులే సెకండ్ ఇయర్‌లో ఇచ్చామని మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రాక్టికల్స్‌లో అందరికీ గరిష్ట మార్కులు కేటాయించామని వివరించారు. ఫెయిల్ అయిన సబ్జెక్టులో మాత్రం పాస్ మార్కులు కేటాయించామని, విద్యార్థులు సంతృప్తి చెందక పోతే కరోనా వైరస్ తగ్గిన తర్వాత పరీక్షలు రాసుకోవచ్చన్నారు.
ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్‌తోనే విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చని మంత్రి సబితా తెలిపారు. విద్యార్థుల పాస్ మేమొల్లో ఏమైనా తప్పులు దొర్లితే 040 - 24600110 సంప్రదించాలని సబిత ఇంద్రారెడ్డి సూచించారు.












Click it and Unblock the Notifications