లైఫ్ సైన్సెస్ అగ్రగామిగా హైదరాబాద్, 250 బిలియన్లే లక్ష్యం: కేటీఆర్
ప్రపంచంలోనే టాప్-10 ఫార్మా కంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్: ప్రపంచంలోనే టాప్-10 ఫార్మా కంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 20వ బయో ఆసియా సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు యూకే భాగస్వామ్య దేశంగా వ్యవహరిస్తోంది. అడ్వాన్సింగ్ ఫర్ వన్ షేపింగ్ నెక్ట్స్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్ కేర్ ఇతివ ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్ పాల్గొన్నారు.

లైఫ్ సైన్సెస్ అగ్రగామిగా హైదరాబాద్: కేటీఆర్
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. లైఫ్ సైన్స్ రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా ఉందని, ఔషధ ఉత్పత్తికి ఆసియాలోనే హైదరాబాద్ పెద్ద నగరమని తెలిపారు. ఈ రంగంలో హైదరాబాద్ కు ఏడేళ్లలో రూ. 25వేల కోట్లు వచ్చాయని, 800కుపైగా ఫార్మా బయోటెక్ కంపెనీలున్నాయని కేటీఆర్ తెలిపారు. మూడింట ఒకవంతు వ్యాక్సిన్ ఉత్పత్తి దేశీయ ఔషధ ఎగుమతుల్లో 30 శాతం తెలంగాణ నుంచే వస్తున్నాయని వెల్లడించారు.
ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో నాలుగు తెలంగాణలోనే: కేటీఆర్
ప్రపంచంలోని టాప్-10 ఫార్మా కంపెనీల్లో నాలుగు తెలంగాణ నుంచే ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. తెలంగాణ ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మారంగ, పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇక్కడ 8 వందలకుపైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలు ఉన్నాయన్నారు.
హైదరాబాద్ ఫార్మాసిటీ వరల్డ్ లార్జెస్ట్ హబ్: కేటీఆర్
హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ ఫార్మాసిటీ వరల్డ్ లార్జెస్ట్ హబ్‌గా నిర్మాణం జరుగుతుందని తెలిపారు. గత ఏడేళ్లలోనే 3 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. మూడురోజులపాటు జరగనున్న ఈ సదస్సులో బయోటెక్, లైఫ్ సైన్సెస్ విభాగంలో పలు స్టార్టప్‌లు పాల్గొని తమ ఉత్పత్తులు ప్రదర్శించనున్నాయి. సదస్సులో పాల్గొనేందుకు 400లకు పైగా అంకురాలు పోటీపడగా 75 సంస్థలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. వాటిలో తుది జాబితాకు 5 సంస్థలు ఎంపికయ్యాయి.












Click it and Unblock the Notifications