Sumithra Pampana: బుల్లితెర నటి ఇంట్లో భారీ చోరీ.. 129 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు..
ప్రముఖ సీనియర్ టెలివిజన్ నటి సుమిత్రా పంపన(Sumithra pampana) ఇంట్లో దొంగతనం జరిగింది. ఆమె సోమవారం ఢిల్లీకి వెళ్లిన సమయంలో హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో తన ఉన్న ఇంట్లోకి దొంగలు చొరబడి ఖరీదైన వజ్రాలు పొదిగిన ఆభరణాలను చోరీ చేశారు. ఏప్రిల్ 17 మధ్యాహ్నం తాను ఢిల్లీకి వెళ్లానని, తాళం వేసి తాళం వేసి తాళాలు అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న తన కోడలు భువనేశ్వరికి ఇచ్చినట్లు నటి సుమిత్రా పంపన పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఏప్రిల్ 18న ఎవరు లేరని తెలిసి ఫ్లాట్‌లో ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, వజ్రాభరణాలను అపహరించారు. అదే రోజు ఆమె మేనకోడలు భువనేశ్వరి వచ్చి చూడగా.. ఫ్లాట్ మెయిన్ డోర్ గొళ్లెం విరిగిపోయినట్లు కనిపించింది. ఆమె వెంటనే సుమిత్రా సోదరుడు విజయ్ కుమార్ కు సమాచారం అందించారు. ఆయన భువనేశ్వరి సుమిత్రాకు తెలపడంతో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. బుధవారం హైదరాబాద్ చేరుకున్న సుమిత్రా సుమారు 129 తులాల బరువున్న బంగారం చోరీకి గురైనట్లు తెలిపింది.

చోరీకి గురైన వాటిలో వజ్రాల ఆభరణాలు, 293 గ్రాముల వెండి ఆభరణాలు ఉన్నాయని సుమిత్రా తెలిపారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సుమిత్రా ఫ్లాట్‌లోని మెయిన్ డోర్ గొళ్లెం పగులగొట్టి ఫ్లాట్‌లోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. ఇనుప అల్మిరా డోర్‌ను తెరిచి ఇనుప అల్మిరా లాకర్‌లోని బంగారు, వజ్రాభరణాలను చోరీకి పాల్పడ్డారని చెప్పారు. దీనపై కేసు నమోదు చేశామని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే అపార్ట మెంట్ లోని సీసీ ఫుటేజీ స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని విశ్లేషిస్తున్నారు.
హైదరాబాద్ లోనే కాదు జిల్లాల్లో కూడా దొంగతనలు పెరిగిపోతున్నాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట గ్రామ శివారులోని జాగృతి విద్యానికేతన్ పాఠశాల సమీపంలో ననుమాస వీరస్వామి కిరాణా షాపు తాళం పగులగొట్టి 5వేల నగదుని ఎత్తుకెళ్లాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయాన ఈ దొంగతనం జరిగిందని బాధితుడు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి విచ్చేసి ఆధారాలు సేకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications