TGSRTC: హైదరాబాద్ వాసులకు శుభవార్త..
కాలుష్యం తగ్గించడానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) 1,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ప్రారంభించిన 13 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఛార్జింగ్ స్టేషన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
దశలవారీగా డెలివరీ చేయబడే ఎలక్ట్రిక్ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (GCC) మోడల్‌లో పనిచేస్తాయి.
ఈ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య నమూనాలో నిర్వహణ కోసం ప్రతి కిలోమీటరు ప్రాతిపదికన ఎలక్ట్రిక్ వాహనాల సరఫరాదారులకు చెల్లింపు ఉంటుంది. వీటిలో 500 కంటే ఎక్కువ బస్సులు సిటీ రూట్లలో సేవలందించనున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, హెచ్‌సీయూ, హయత్‌నగర్-2, రాణిగంజ్, కూకట్‌పల్లి, బీహెచ్‌ఈఎల్, హైదరాబాద్-2, వరంగల్, సూర్యాపేట, కరీంనగర్-2, నిజామాబాద్ సహా పలు డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఒక్కో స్టేషన్‌లో 20 నుంచి 25 ఛార్జింగ్ గన్‌లు ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. చాలా బస్సులను ఏకకాలంలో ఛార్జ్ చేయడానికి వీలు ఉండే విధంగా చార్జింగ్ స్టేషన్లు ఉండనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు సూర్యాపేట, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ వంటి అధిక ట్రాఫిక్ మార్గాల్లో నడపనున్నారు. హెచ్‌సీయూ, హయత్‌నగర్ వంటి డిపోల్లోని డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేసి, గతంలో ఉన్న వాటిని గ్రామీణ ప్రాంతాలకు కేటాయించనున్నారు.
ప్రస్తుతం, TGSRTC విమానాశ్రయ రూట్లలో 49 పుష్పక్ బస్సులు, విజయవాడ, హైదరాబాద్ మధ్య 10 E-గరుడ బస్సులతో సహా 100 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. ప్రస్తుతం తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ఉచిత బస్సు పథకంతో మహిళలు రూ.2352 కోట్లను అదా చేసుకున్నారు.












Click it and Unblock the Notifications