అందుకే ఆ సినిమా.. అప్పుడు అధికారంలో ఉంది బీజేపీ కదా.. కేసీఆర్
కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అందులో వివిధ అంశాలపై కేసీఆర్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై కూడా మాట్లాడారు. దేశంలో సమస్యలను పక్కదారి పట్టించడానికే ఈ సినిమాను విడుదల చేశారని ఆరోపించారు. లేకుంటే ఈ సమయంలోనే విడుదల చేయాలా అని అడిగారు. యాసంగి పంట కొనుగోలు కోసం ఆందోళన బాట పడతామని స్పష్టంచేశారు.

అందుకే సినిమా..?
రైతు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు సినిమాను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. ఆ నాడు కశ్మీర్‌లో పండిట్ల ఊచకోత కోసినప్పుడు బీజేపీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది? అని అడిగారు. మరీ అప్పుడు ఏం చేశారని నిలదీశారు. ఇప్పుడు సినిమాను ప్రమోట్ చేసి.. లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు దేశానికి కావల్సింది కశ్మీర్ ఫైల్స్ కాదని, డెవలప్ మెంట్ ఫైల్స్ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

అనుకూలంగా మార్చుకొని
..
బీజేపీ సర్కార్ ప్రతీ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుందని పేర్కొన్నారు. అలానే కశ్మీర్ ఫైల్స్ మూవీని కూడా తనకు అనుకూలంగా మార్చుకుందని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదానికి ఎవరూ కారణం అని కేసీఆర్ ప్రశ్నించారు. జనం ఏమీ గుర్తుంచుకోరు.. అని అనుకుంటారా ఫైరయ్యారు. తమ తప్పదిన్నా మళ్లీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం ఏమిటని అడిగారు.

రాధేశ్యామ్‌కు దెబ్బే..
వివేక్ ఆర్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి కశ్మీర్ ఫైల్స్ ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. మూవీ విశేషంగా ప్రజాదరణ పొందింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 10 రోజుల్లో రూ.192.35 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.12 కోట్లు మాత్రమే కాగా.. మంచి వసూళ్లు పొందుతుంది. ఈ మూవీ హైప్‌తోనే ప్రభాస్ రాధేశ్యామ్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. దాదాపు రూ.100 కోట్ల నష్టాన్ని చవిచూసింది.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications