Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్.. వచ్చే ఐదు రోజులు జాగ్రత్త..!
రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. మార్చి మొదటి వారంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 12 గంటల తర్వాత జనం బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్నాడు. ఫిబ్రవరిలోనే మండిపోయిన ఎండలు.. మార్చిలో దంచి కొట్టనున్నాయి. ఉదయం, సాయంత్రం టెంపరేచర్ తక్కువగా ఉన్నా.. మధ్యాహ్నం మాత్రం ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా ఎండలు మండిపోతున్నాయి.
జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతోన్నాయి. పలు చోట్ల సాధారణం కంటే అధికంగా ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 5 రోజుల తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ వివరించింది. ఇటు హైదరాబాద్ లో కూడా ఈ ఐదు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందట. ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మార్చి 3 నుంచి 8 వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఆదివారం నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వివరించింది. ఈ రోజులల్లో 37 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. నైట్ టైమ్ లో కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈ ఉష్ణోగ్రతలకు నగరవాసులు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పుచ్చకాయ, దోసకాయ, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నపదార్థాలు తీసుకోవచ్చని సూచించారు.
ఎండల తీవ్రత పెరుగుతుండడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. ప్రజలు కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు వాడడం పెంచారు. దీంతో విద్యుత్ వినియోగం పెరిగింది.












Click it and Unblock the Notifications