Ind Vs Aus: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద ఉద్రక్తత.. పోలీసుల లాఠీ ఛార్జ్..
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద తీవ్ర ఉద్రక్తత నెలకొంది. ఈనెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. ఇందుకు సంబంధించి జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల విక్రయిస్తున్నారు. టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు వేలల్లో తరలి వచ్చారు. దీంతో అక్కడ ఎక్కువ మంది గుమిగూడారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.

20 మంది
ఈ క్రమంలో పోలీసులు, అభిమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పలువురు సృహతప్పి పడిపోయారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. గాయాలైన అభిమానులు, పోలీసులను ఆస్పత్రికి తరలించారు.20 మంది అభిమానులు స్పృహ తప్పి పడిపోయినట్లు తెలిసింది. అయితే అంచనాలకు మించి అభిమానులు టికెట్ల కోసం రావడంతో ఇలా జరిగినట్లు తెలుస్తోంది.

శ్రీనివాస్ గౌడ్
టికెట్ల విషయంలో తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే స్పందించారు. మ్యాచ్ టికెట్స్ విషయంలో బ్లాక్ టికెట్స్‌పై సీరియస్ యాక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. టికెట్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని సేల్ చేశారు? ఎవరికి ఎన్ని టికెట్స్ కేటాయిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు టికెట్ల విక్రయాల వద్ద సాంకేతిక లోపంతో ఆన్‌లైన్ పేమెంట్లు జరగడం లేదని అభిమానులు చెబుతున్నారు.
3 వేల టికెట్ల కోసం 30 మంది
దీంతో నగదు తీసుకుని టికెట్లు విక్రయిస్తున్నారని. హెచ్ సీఏ ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తుందని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 వేల టికెట్ల కోసం 30 మంది ఫ్యాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే గాయపడిన వారిలో ఒక్కరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

విలో మ్యాచ్ చూడొచ్చు
టికెట్ల కోసం ప్రాణాల మీదికి తెచ్చుకుంటారా అని సోషల్ మీడియాలో పలువురు విమర్శిస్తున్నారు. ఇంట్లో టివిలో మ్యాచ్ చూడొచ్చు కదా అని సలహా ఇస్తున్నారు. పోలీసులు అనవసరంగా లాఠీ ఛార్జ్ చేశారని అభిమానులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications