మేడమ్ ఇదీ సరికాదు.. మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి: మంత్రి హరీశ్ రావు
గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ చేసిన కామెంట్ల రచ్చ ఇంకా ముగియలేదు. బీజేపీ- టీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. ఇప్పుడు లైన్‌లోకి మంత్రి హరీశ్ రావు ఎంట్రీ ఇచ్చారు. అవును.. గవర్నర్ కామెంట్లను ప్రస్తావించారు. వైద్యారోగ్య రంగంపై తమిళి సై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఇదీ సరికాదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం పరిస్థితి బాగోలేదని గవర్నర్ విమర్శలు చేయగా.. వైద్యుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వైద్య వ్యవస్థపై గవర్నర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాని హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో వైద్య వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. కానీ వైద్యరంగం పేరు ప్రస్తావించి మరీ.. కామెంట్ చేయడం సరికాదన్నారు. పేదలు మెరుగైన ఆరోగ్యం.. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పేదల ఆరోగ్యం తమ ప్రయారిటీ అని చెబుతుంది.

గవర్నర్‌గా మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తమిళిసై సౌందర రాజన్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించాలని.. చాలాసార్లు చెప్పానని పేర్కొన్నారు. నిమ్స్ డైరెక్టర్ వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేరారని విమర్శించారు. వర్సిటీల్లో ఖాళీ పోస్టులు, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలను ప్రస్తావించారు.
గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా హరీశ్ రావు వివరణతో కూడిన కౌంటర్ ఇచ్చారు. వైద్య వ్యవస్థ విషయంగా గవర్నర్ తమిళిసై కామెంట్స్ సరికాదన్నారు. వైద్యుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం బాధాకరమని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వైద్య, ఆరోగ్య వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న బీబీనగర్ ఎయిమ్స్‌కు వెళ్లి చూడాలని.. అక్కడ కనీస వసతులు కూడా లేని పరిస్థితిని పరిశీలించాలని గవర్నర్‌కు మంత్రి హరీశ్ రావు సూచించారు.












Click it and Unblock the Notifications