Meenakshi Chaudhary: గురూజీ చేతిలో పడితే అంతే ..!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు. త్రివిక్రమ్‌లో ఉన్న దర్శకుడు కన్నా ఆయనలో ఉన్న కథ రచయితకే అభిమానులు ఎక్కువ. తీసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ .. తన మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో వరుస సినిమాలకు దర్శకత్వం వహించారు.
త్రివిక్రమ్ సినిమాల్లో డైలాగులు ఎంత ఫేమసో..ఆయన సినిమాల్లో హీరోయిన్లు కూడా అంతే ఫేమస్. తన సినిమాల్లో హీరోయిన్లను త్రివిక్రమ్ చాలా అందంగా చూపిస్తుంటారు. మొదటి సినిమా 'నువ్వే నువ్వే' దగ్గర నుంచి మొన్న వచ్చిన 'అలా వైకుంఠపురం' సినిమా వరకూ చూసుకుంటే తన సినిమాల్లో హీరోయిన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారాయన.

హీరోయిన్లను రీపిట్ చేయడం త్రివిక్రమ్‌కు మొదటి నుంచి అలవాటే. సమంతతో మూడు సినిమాలు చేసిన త్రివిక్రమ్, పూజా హెగ్దెను రెండు సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకున్నారు. తాజాగా మహేష్ బాబుతో 'గుంటూరు కారం' సినిమాలో కూడా త్రివిక్రమ్ తొలుత పూజా హెగ్దెనే ఎంపిక చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె 'గుంటూరు కారం' నుంచి తప్పుకోవడంతో..ఆ సినిమాలో మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా తీసుకున్నారు.

'గుంటూరు కారం'లో హీరోయిన్‌గా ఎంపికైన దగ్గర నుంచి మీనాక్షి చౌదరి టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ ఒక్కసారిగా మారిపోయింది. తాజాగా ఈ భామ అందాల విందుతో రెచ్చిపోయింది. హైదరాబాద్‌లో జరిగిన సైమా ఈవెంట్‌కు మీనాక్షి చౌదరి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

రెడ్ డ్రెస్‌లో గ్లామర్ తళుకులతో అభిమానులను మెస్మరైజ్ చేసింది.ఎద అందాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోయింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. గురూజీ చేతిలో పడితే ఏ హీరోయిన్ దశ అయినా మారిపోతుందని కామెంట్లు చేస్తున్నారు.గుంటూరు కారం హిట్ అయితే మీనాక్షి చౌదరి టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా మారుతుందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం మీనాక్షి చౌదరి హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications