మునుగోడు టీఆర్ఎస్ కంచుకోట: కల్వకుంట్ల కవిత ధీమా
అప్పుడే మునుగోడు రాజకీయం మొదలైంది. అక్కడ పాగా వేయాలని అన్నీ పార్టీలు అనుకుంటున్నాయి. సిట్టింగ్ స్థానం నిలుపుకునేందుకు కాంగ్రెస్.. గెలిచి పరువు నిలుపుకోవాలని టీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. గెలిచి తమ పార్టీని మరింత విస్తరించాలని బీజేపీ పథకం రచిస్తోంది. ఇప్పటికే ఆయా పార్టీలు గ్రౌండ్ లెవల్లో క్యాంపెయిన్ చేస్తున్నాయి. విజయంపై మాత్రం అన్నీ పార్టీలు ధీమాతో ఉన్నాయి.
టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయం అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మునుగోడు నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అన్నారు. హుజుర్‌నగర్, నాగార్జునసాగర్ మాదిరిగా మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కూడా తమ ప్రభుత్వం సంక్షమ పథకాలు కంటిన్యూ చేసిందని గుర్తుచేశారు. పెన్షన్లు అందించామని వివరించారు. అందుకోసమే మునుగోడు ప్రజలు తమకు పట్టం కడతారని అంటున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక అంశం వేడెక్కుతోంది. బహిరంగ సభతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బోణీ చేయగా, ఈ నెల 21వ తేదీన చౌటుప్పల్‌లో భారీ సభకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏర్పాట్లు ప్రారంభించారు. ఉప ఎన్నికకు సంబంధించి అధికార టీఆర్‌ఎస్ సైలంట్ ఆపరేషన్‌కు తెరలేపింది. హుజూరాబాద్‌లో హడావుడి చేసి బోర్లాపడ్డ అనుభవంతో స్థానికంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. మంత్రి జగదీష్ రెడ్డి మూడు నెలల నుంచి ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి.. అసెంబ్లీ ఎన్నికలకు మరింత బలపడాలని బీజేపీ అనుకుంటుంది. అందుకోసం ఒక టీమ్ కూడా రూపొందించింది. బై పోల్ వెనక.. ఏకంగా అమిత్ షా వ్యుహాం రచించారని తెలిసింది. అంటే బీజేపీ ఆ ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం అవుతుంది. అలాగే టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా అంత ఈజీగా తీసుకోవడం లేదు.












Click it and Unblock the Notifications