వందల మంది విద్యార్థులకు ఒక్కటే టాయ్‌లెట్?: హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన వసతుల కోసం ఏ చర్యలు తీసుకుంటున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యా సంస్థలో వసతులపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన వసతుల కోసం ఏ చర్యలు తీసుకుంటున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సమస్యలపై ఎల్ఎల్బీ విద్యార్థి మణిదీప్ రాసిన లేఖను సుమోటోగా తీసుకున్న హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

700 మంది విద్యార్థినులకు ఒకే మూత్రశాల ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే ప్రభుత్వ విద్యా సంస్థల్లో బాలికలకు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్, విద్యాశాఖ కార్యదర్శి, ఇంటర్ బోర్డు కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. ఏప్రిలో 25 లోగా విద్యా సంస్థల్లోని వసతులపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

TS High Court key orders to Telangana Govt on facilities in educational institutions

కాగా, గతంలో కొన్ని పాఠశాలల విద్యార్థులు తమకు సరైన వసతులు కావాలంటూ నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. పలు చోట్ల సమస్యలకు పరిష్కారం లభించగా.. మరికొన్ని చోట్ల మాత్రం విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. సరైన పాఠశాల భవనం, మూత్ర శాలలు వసతలు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్న ఘటనలు ఇటీవల చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+