టీఎస్ఆర్టీసీ సమ్మె, డెడ్‌లైన్‌తో సీఎం డకౌట్ అయ్యారు... ఆర్టీసీ జాక్

Recommended Video

    TSRTC Samme : RTC JAC Leader Ashwathama Reddy Responds On CM KCR De@d Line

    ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామంటున్న సీఎం కేసీఆర్ ప్రకటనలు అమలు సాధ్యం కావని ఆర్టీసీ జేఏసీ కన్వినర్ అశ్వద్దామ రెడ్డి అన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలంటే కేంద్రం అనుమతితో పాటు గుర్తింపు సంఘం అంగీకరించాలని ఆయన తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం సుదీర్ఘ చట్టపరమైన కసరత్తు చేయాల్సి ఉంటుందని అన్నారు, దీంతో సీఎం వాఖ్యలపై కార్మికులు ఎలాంటీ అందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా కార్మికులతో చర్చలు చేపట్టాలని జాక్ నేతలు కోరారు.

    ముఖ్యమంత్రి చెబితే 300 కార్మికులు కూడ ముందుకు రాలేదు

    ముఖ్యమంత్రి చెబితే 300 కార్మికులు కూడ ముందుకు రాలేదు

    ఆర్టీసీ కార్మికులకు విధించిన డెడ్ లైన్ ముగియడంతో కార్మిక సంఘాలు తమ సమ్మెను మరింత ఉదృతం చేశాయి. ముఖ్యమంత్రి పిలుపుతో కార్మికుల్లో పెద్దగా స్పందన కరువైంది. ముఖ్యమంత్రి అధికారుల చేత ఒత్తిడి చేయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల మంది కూడ జాయిన్ కాలేదని కార్మిక జేఏసీ నాయకులు తెలిపారు. దీంతో కార్మికులు ఐక్యంగా ఉన్నారని ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక జాయిన్ అయిన వారితో కూడ స్లిప్పులు రాయించుకుని తిరిగి పంపారని తెలిపారు. ఇంతమంది ప్రజాప్రతినిధులు కలిసినా.. కనీసం ఒక్కశాతం ఉద్యోగులు ముందుకు రాలేదని అన్నారు. ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు డెడ్‌లైన్ పెట్టి డకౌట్ అయ్యారని ఎద్దెవా చేశారు.

     కేంద్రం అనుమతితోనే ప్రైవేట్‌పరం

    కేంద్రం అనుమతితోనే ప్రైవేట్‌పరం


    ఇక ఆర్టీసీ ఇప్పటి వరకు చట్టప్రకారం విడిపోలేదని, దీంతో ప్రభుత్వం ప్రకటిస్తున్నట్టుగా ప్రైవేటు పరం చేయాలంటే కేంద్రం అనుమతి అవసరం ఉంటుందని చెప్పారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మోటారు చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయమని శాసనసభలోనే ప్రకటించిందని , ఒకవేళ కేంద్ర చట్టాన్ని అమలు చేయాలంటే అసెంబ్లీ అమోదం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం అనుమతితో పాటు గుర్తింపు సంఘం అమోదం తీసుకోవాలనే నిబంధన చట్టంలో ఉందని జాక్ కన్వినర్ అశ్వద్దామ రెడ్డి చెప్పారు.

     మిలియన్ మార్చ్ మద్దతుకోసం బీజేపీని కలిసిన జాక్ నేతలు

    మిలియన్ మార్చ్ మద్దతుకోసం బీజేపీని కలిసిన జాక్ నేతలు

    ఆర్టీసీ సమ్మెకొనసాగిస్తున్న జాక్ నాయకులు బుధవారం బీజేపీ కార్యాలయానికి వెళ్లి పార్టీ మిలియన్ మార్చ్‌కు మద్దతు ఇవ్వాలని అధ్యక్షుడు లక్ష్మణ్‌తోపాటు ఇతర నేతలను కోరారు. దీంతో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన మిలియన్ మార్చ్‌కు బీజేపీ తన సంపూర్ణ మద్దతు తెలిపిందని తెలిపారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా దగ్గరికి ఆర్టీసీ ప్రతినిధులు వెళ్లి సమస్యను వివరించారని తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కలిసి సమ్మెకు మద్దతుగా పెన్‌డౌన్ చేయాలని కోరనున్నట్టు చెప్పారు.

    కోర్టు ఉత్తర్వులపై సీఎం చర్చ

    కోర్టు ఉత్తర్వులపై సీఎం చర్చ


    ఈ నేపథ్యంలోనే హైకోర్టు అధికారులకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర సమచారంతో సీఎస్ ఎస్‌కే జోషి, ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్‌శర్శ ,ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావుతోపాటు జీహెచ్‌ఎంసీ కమీషనర్ లోకేష్‌కుమార్‌లు ఈ నెల ఏడవ తేదిన కోర్టులో హజరు కావాలని అదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఆయా విభాగాలు కోర్టుకు సమర్పించిన నివేదికలు విరుద్దంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. దీంతో పూర్తివాస్తవాలను ఈనెల ఆరవతేదీల్లోగా సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. కోర్టుకు సమర్పించాల్సిన నివేదికలపై అధికారులతో చర్చిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+