వసతులు, సౌకర్యాలేవీ.. అయినా స్కూల్స్ ప్రారంభమా.. విజయశాంతి
కరోనా తగ్గుముఖం పట్టడం.. ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ తెరవడంతో.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కూడా స్కూల్స్ తెరుస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. దీనిపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. సెప్టెంబరు 1 నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు తెరుచుకోనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొవిడ్ తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న,, సర్కారు విద్యాసంస్థలకు అనుమతి ఇచ్చింది. దీనిపై బీజేపీ మహిళా నేత విజయశాంతి విమర్శనాత్మకంగా స్పందించారు.
కొవిడ్ తగ్గిందంటూ పాఠశాలలు తెరిచేందుకు రాష్ట్ర సర్కారు ప్రదర్శిస్తున్న దూకుడు చూస్తుంటే పాలకులకు విద్యార్థుల భవిష్యత్తుపై ఏమాత్రం పట్టింపు లేదన్న విషయం అర్థమవుతోందని తెలిపారు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో లాక్ డౌన్లు విధించడంతో అనేక స్కూళ్లలో ఫర్నిచర్ పాడైపోయిందని, వర్షాలకు గోడలు, పైకప్పులు దెబ్బతిని ప్రమాదకరంగా తయారయ్యాయని, పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు కూడా కరవైనట్టు ఉస్మానియా వర్సిటీ మాజీ డీన్ వెల్లడించిన వైనం మీడియాలో వచ్చిందని విజయశాంతి వివరించారు.
పలు ప్రాంతాల్లో కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో పాఠశాలలకు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారని తెలిపారు. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం స్కూళ్లు తెరిచేందుకు వారం రోజుల సమయం కూడా లేదని, ప్రాథమిక సౌకర్యాల పరిస్థితులు చక్కదిద్దకుండా పిల్లలను స్కూళ్లకు రప్పిస్తే వారు చదువుకునే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. అగ్రరాజ్యం అమెరికాలోనూ బడులు తెరిచిన తర్వాత పిల్లల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే విద్యాసంస్థలు తెరవాలని తల్లిదండ్రులతో సహా అందరూ కోరుకుంటున్నారని వివరించారు. ఇవేమీ పట్టించుకోకుండా తెలంగాణ పాలకులు మొండిగా ముందుకెళితే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని విజయశాంతి స్పష్టం చేశారు.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు.
Recommended Video
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications