హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సారూ.. పెన్షన్లు ఏవీ.. ఆప్లై చేసి చాన్నాళ్లవుతుంది.. కేసీఆర్‌పై రాములమ్మ ఫైర్

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్‌పై రాములమ్మ విజయశాంతి ఫైరయ్యారు. పెన్షన్ ఊసు మరచిపోయారా అని అడిగారు. 57 ఏళ్లు నిండిన అర్హులందరికీ వెంటనే పెన్షన్లు ఇస్తామని కేసీఆర్ చెప్పిన మాటలను గుర్తుచేశారు. అర్హత గల ఎంతో మంది వృద్దులు పంచాయితీ సెక్రటరీల ద్వారా ఎంపీడీఓలకు అప్లికేషన్ పెట్టుకుని... మూడేండ్లుగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆగస్టు నుంచే ఆసరా పెన్షన్లు ఇస్తామని పోయిన గతేడాది జులైలో సిరిసిల్ల పర్యటనలో సీఎం కేసీఆర్ ప్రకటించగా.. హడావిడిగా అదే నెల 15 నుంచి 31 వరకు.. మీ సేవ కేంద్రాల ద్వారా సుమారు 9.5 లక్షల మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారని గుర్తుచేశారు.

ఇప్పటి వరకు వెరిఫికేషన్ ప్రారంభించలేదన్నారు. ఆగస్టులో ఇస్తామన్న పెన్షన్​ అక్టోబర్‌లో ఇచ్చే పరిస్థితి కనిపించలేదని చెప్పారు. పాత లబ్ధిదారులు 37 లక్షల మంది కాగా.. మీ సేవ కేంద్రాల ద్వారా 9.5 లక్షల మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గడువు ముగిసి ఇంత కాలం గడచినా వెరిఫికేషన్ మొదలుపెట్టలేదు. ఆగస్టులో ఇస్తామనే పెన్షన్​ అక్టోబర్‌లోనూ ఇచ్చే పరిస్థితి కనిపించలేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పటి నుంచి కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోయింది. వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలకు కూడా ప్రభుత్వం కొత్తవి మంజూరు చేయలేదు.

where is old age pensions:vijayashanti

అప్పట్లో 65 ఏండ్లు నిండి, ప్రస్తుతం 67, 68 ఏండ్లకు వచ్చిన వృద్ధులకూ మంజూరు చేయలేదంటే ప్రభుత్వం వృద్ధుల పట్ల ఎలాంటి వైఖరితో ఉందో ఇట్టే అర్దమవుతుందన్నారు. పెన్షన్​ తీసుకుంటూ వస్తున్న వాళ్లలో పలువురు వివిధ కారణాలతో నెలనెలా నాలుగైదు వేల మంది చనిపోతున్నారు. వీరి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఏటా 50 వేల నుంచి 60 వేల మంది చొప్పున మూడేండ్లలో 1.70 లక్షల మందిని జాబితా నుంచి ప్రభుత్వం తీసివేసింది. వీరి స్థానంలో కొత్తవారికి పెన్షన్లు మంజూరు చేయలేదు. ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను మోసగించడమే కేసీఆర్‌కు తెలుసు అన్నారు. కేసీఆర్ సర్కార్‌కు రానున్న రోజుల్లో రాష్ట్ర ఓటర్లు తగిన బుద్ది చెప్పడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

English summary
where is old age pensions bjp leader vijayashanti asked telangana government. she is angry on cm kcr
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X