కుక్కలను తరిమికొట్టడంలో జీహెచ్ఎంసీకి ఎందుకంత నిర్లక్ష్యం?మరోసారి మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.!
హైదరాబాద్: వీధి కుక్కలను తరిమి కొట్టడంలో అధికారుల నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వ ఉదాసినతే చిన్నారి ప్రదీప్ మృతికి కారణమయ్యిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసహనాన్ని వ్యక్తం చేసారు. కుక్కల విషయంలో జీహెచ్ఎంసీ కమిటీలతో కాలయాపన చేయడం సరి కాదన్నారు కేంద్రమంత్రి. కుక్కల దాడిలొ బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం పెంచాలన్నారు కిషన్ రెడ్డి. ఇటీవల వీధి కుక్కల దాడిలో మృతి చెందిన చిన్నారి ప్రదీప్ కుటుంబాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్బంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు కిషన్ రెడ్డి.

అంబర్ పేట కుక్కల ఘటన బాధాకరం..
అంతే కాకుండా మృతి చెందిన బాలుడి అక్క మేఘన చదువుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కుక్కల దాడిలో ప్రదీప్ చనిపోవడం దురదృష్టకరం, అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. కుక్కలపై ఫిర్యాదు చేస్తే.. పట్టుకుని కుటుంబ నియత్రణ ఆపరేషన్లు చేసి మళ్లీ వదిలేస్తున్నారని, వీధి కుక్కల బెడదకు శాస్వత పరిష్కారంపై తాను కొన్ని సూచనలు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
కుక్కలను పట్టుకుని, వాటిని ఒకచోట పెట్టాలని, వాటికి ఏం ఆహారం అందిస్తారు, బడ్జెట్ ఎంత కేటాయిస్తారో నగర పాలక సంస్థ అధికారులు చెప్పాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

కుక్కలన్నీ బయటకు తరలించాలి..
దీంతో పాటు అంబర్ పేటలో ఉన్న కుక్కలన్నీ బయటకు తరలించాలని, ఘటనలో జీహెచ్ఎంసీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు కిషన్ రెడ్డి.
హైదరాబాద్ అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ మృతి చెందడానికి ప్రభుత్వం, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
చిన్నారి ప్రదీప్ కుటుంబాన్ని పరామర్శించిన కిషన్ రెడ్డి.. వారిని ఓదార్చారు. తన సాలరీ నుంచి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అదే విధంగా మృతి చెందిన బాలుడి అక్క చదువుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానన్నారు.

కుక్కల దాడిలో పసిబాలుడు చనిపోవడం దారుణం..
పసిబాలుడు కుక్క కాటుతో చనిపోవడం అందరినీ బాధ కలిగించిందని, ఎవరెవరికో సహాయం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి నిరుపేదలకు ఎందుకు సాయం చేయడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బాధపడుతోన్న కుటుంబానికి తక్కువ సహాయం చేయడం దారుణమన్నారు. ప్రదీప్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం పెంచాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వీధి కుక్కల సమస్య పరిష్కారానికి పోరాటం చేయాలన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ ప్రజల ప్రాణాలు కాపాడాలన్నారు.హైదరాబాద్ బస్తీల్లో పేద పిల్లలు ఎక్కువగా రోడ్లపైనే ఆడుకుంటారని, అక్కడే కుక్కలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు.

కుక్కల నియంత్రణకు శాశ్వత పరిష్కరాం కావాలి..
అంతే కాకుండా ఫిర్యాదు చేస్తే కుక్కలను పట్టుకుని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి మళ్లీ నగర వీధుల్లో వదిలేస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ కమిటీల పేరుతో తూతూ మంత్రంగా కాలయాపన చేయడం కాదన్నారు. హైదరాబాద్ ప్రజలకు రక్షణ కల్పించాలన్నారు.
ప్రజల ప్రాణలు కాపడటమే తమ లక్ష్యమన్నారు కిషన్ రెడ్డి. ఇందులో రాజకీయాలు చేయాలనుకోవడం లేదన్నారు. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం బాలుడి ప్రాణం పోవడంతోనే తాము ప్రశ్నిస్తున్నామన్నారు. అటు బీజేపీ కార్పొరేటర్లు చిన్నారి ప్రదీప్ కుటుంబానికి మరో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు.












Click it and Unblock the Notifications