Hyderabad: రాయదుర్గంలో దారుణం.. సరోగసీ కోసం వస్తే ప్రాణాలు పోయాయి..!

ఈ మధ్య సంపన్న కుటుంబాలకు చెందిన వారు సరోగసీ విధానం ద్వారా పిల్లలను కంటున్నారు. కొంత మంది పిల్లలు కాకపోవడంతో సరోగసీ విధానానికి వెళ్తున్నారు.
తాజాగా సరోగసీ విధానంలో బిడ్డను కనేందుకు వచ్చిన ఓ మహిళ 9 అంతస్థుల పై నుంచి పడి మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్ రాయదుర్గంలో జరిగింది.
రాయదుర్గంలోని మై హోమ్ భూజాలో 9వ అంతస్థులోని ప్లాట్ నంబర్ 901లో 55 ఏళ్ల రాజేశ్ బాబు అనే వ్యక్తి భార్య, తల్లితో కలిసి ఉంటున్నాడు. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వారికి పిల్లలు లేకపోవడంతో సరోగసీ విధానంలో పిల్లలను కనాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో ఒడిశాకు చెందిన బ్రోకర్ సందీప్ పరిచయం అయ్యాడు. తమకు సరోగసీ విధానంలో బిడ్డ కనే మహిళ కావాలని రాజేశ్ బాబు సందీప్ కు చెప్పుడు. దీంతో సందీప్ అదే రాష్ట్రానికి చెందిన అశ్వితా సింగ్, ఆమె భర్త సంజయ్ సందీప్ మాట్లాడారు. సరోగసీ విధానంలో బిడ్డను కని ఇస్తే రూ.10 లక్షలు వస్తాయని చెప్పాడు. దీంతో అశ్వితా సింగ్ ఒప్పుకుంది. దీంతో వారి కుటుంబం హైదరాబాద్ వచ్చింది. సరోగసీ సంబంధించి ఒప్పంద పత్రం రాయించుకున్నారు. అశ్వితా సింగ్ రాజేశ్ బాబు ఇంట్లోని ఓ రూమ్ ఉంటుండగా.. భర్త సంజయ్, కుమారుడు సర్వెంట్ క్వార్టర్స్ లో ఉంటున్నారు.

Woman who came to Hyderabad for surrogacy falls to her death from building

అయితే అశ్విత రూమ్ ఒంటరిగా ఉండడం.. కుమారుడు, భర్తను రాజేశ్ కలవకుండా చేయడం చేశాడు. అలాగే అశ్వితా సింగ్ వేధింపులకు గురి చేసినట్లు తెలిసింది. ఇది భరించలేని ఆమె ఒడిశాకు వెళ్లిపోదామని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో రాజేశ్ బాబు ఆమెను రూమ్ నుంచి బయటకు రాకుండా, ఫోన్ చేయకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అశ్వితా సింగ్ అక్కడి నుంచి తప్పించుకోవాలని చూసింది. కానీ ప్లాట్ కు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఉండడంతో ఆమె తప్పించుకోలేకపోయింది.

ఎలాగైనా పారిపోవాలని నిర్ణయించుకున్న ఆమె మంగళవారం తెల్లవారుజామున తన చీరలను ఒకదానికి ఒకటి కట్టి కిందికి వేలాడదీసింది. చీరను పట్టుకుని కిందికి దిగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పట్టు తప్పి కింది పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం అశ్వతా సింగ్ మృతదేహాన్ని చూసిన సెక్యూరిటీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+