యాదాద్రికి అవార్డు: గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హర్షం

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి. లక్ష్మీ నరసింహా స్వామి క్షేత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యద్బుతంగా తీర్చిదిద్దింది. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాసిల్లనుంది. యాదాద్రి అరుదైన ఘనత సాధించింది.స్వామి వారి ఆలయం గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ (ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రం) అవార్డుకు ఎంపికైంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గురువారం యాదాద్రి ఆలయానికి అవార్డును ప్రకటించింది.

2022- 25 సంవత్సరాలకు గానూ యాదాద్రికి ఆ సంస్థ అవార్డును ప్రకటించింది. యాదాద్రికి అవార్డు రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ కూడా సంతోష పడ్డారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన యాదాద్రికి అవార్డు రావడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్వయం పాలనలో తెలంగాణ ఆలయాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు దక్కడం దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన గౌరవమని అన్నారు.

yadadri temple got green place of worship award

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే యాదాద్రి రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్ నిధులు సమకూర్చి.. ఆలయ రూపు రేఖలనే మార్చారు. యాదగిరిగుట్టను కాస్తా యాదాద్రిగా మార్చివేశారు. యాదాద్రిలో స్వామివారు స్వయంభువు. అంటే స్వామి వారి విగ్రహాలను రూపొందించినది కాక.. వెలిసింది. ఏపీలో కాణిపాకంలో వినాయకుడు కూడా స్వయంభువు. తిరుపతి వెళ్లిన వారు విధిగా కాణిపాకం వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+