ఇండియా మార్కెట్ లోకి హ్యూందాయ్ ఎక్స్ టర్
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ భారత మార్కెట్లోకి ఓ సరికొత్త మైక్రో ఎస్‌యూవీ ఎక్స్‌టర్ (Hyundai Exter)ని విడుదల చేసింది. బేస్ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.5,99,900. టాప్ వేరియంట్ రూ.9,31,990గా కంపెనీ నిర్ణయించింది. హ్యుందాయ్ విక్రయించే ఎస్‌యూవీల విభాగంలో ఇదే అత్యంత తక్కువ ధరకు లభించేది.
టాటా పంచ్, సిట్రాన్ సీ3, రెనో కిగెర్, నిస్సాన్ మాగ్నెట్‌తో పోటీపడబోతోంది. గ్రాండ్ ఐ10 నియోస్‌ను నిర్మించిన కె1 ప్లాట్‌ఫామ్ పైనే దీనిని కూడా తయారు చేశారు. ఈఎక్స్, ఎస్, ఎస్‌ఎక్స్, ఎస్‌ఎక్స్(ఓ), ఎస్‌ఎక్స్(ఓ) కనెక్ట్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 11వేల బుకింగ్స్ వచ్చినట్టు కంపెనీ తెలిపింది. వీటిల్లో 38 శాతం ఆటో వేరియంట్‌కు, 20 శాతం సీఎన్‌జీ వేరియంట్‌కు వచ్చాయి.

ఈ కారులో 1.2 లీటర్ ఎన్‌ఏ ఇంజిన్ అమర్చడంతోపాటు 83 బీహెచ్‌పీ, 114ఎన్‌ఎం టార్క్ విడుదల చేస్తుంది. 5స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటో గేర్‌బాక్స్‌ల ఆప్షన్లలో లభిస్తోంది. సీఎన్‌జీ ఇంజిన్ 69 బీహెచ్‌పీ, 95.2 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేయడంతోపాటు ఏఎంటీ గేర్‌బాక్స్‌కు పెడల్ షిఫ్టర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. పెట్రోల్ ఇంజిన్ మైలేజీ లీటర్‌కు 19.4 కిలోమీటర్లుగా కంపెనీ వెల్లడించింది. ఆటోమేటిక్ వేరియంట్ 19.2గా, సీఎన్‌జీ వేరియంట్ కిలోకు 27.1 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఎస్ యూవీ చిన్నదే అయినా బాక్స్ డిజైన్ ఉండేటట్లుగా చూశారు. పారామెట్రిక్ డిజైన్ విధానాన్ని ఉపయోగించారు.
డేటైమ్ రన్నింగ్ లాంప్స్, వెనుకవైపు హెచ్ ఆకారంలోని ఎల్‌ఈడీ లైట్లు, 15 అంగుళాల డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. మూడు డ్యూయల్‌టోన్ కలర్స్ వాడారు. 3,815 ఎంఎం పొడవు, 1,710 ఎంఎం వెడల్పు, 1,631 ఎంఎం ఎత్తు ఉంది. ఈ కారు వీల్ బేస్ 2,450 ఎంఎం కాగా.. గ్రౌండ్ క్లియరెన్స్ 185 ఎంఎం.
కారు లోపల మొత్తం భాగాలు నలుపురంగులో ఉన్నాయి. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది. సింగిల్ పాన్ సన్‌రూఫ్, డాష్ క్యామ్, ముందు, వెనుక కెమెరాలు, కీలెస్ ఎంట్రీ, 8 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఇన్‌బిల్ట్ నావిగేషన్, కనెక్టెడ్ కార్‌టెక్, వాయిస్ కమాండ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్‌సీ, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఏబీఎస్, ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సర్, త్రీపాయింట్ సీట్ బెల్ట్, అన్ని సీట్లకూ సీట్‌బెల్ట్ రిమైండర్ ఉంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications