హిట్‌మ్యాన్ ఓల్డ్ అవతార్- గతాన్ని గుర్తు చేశాడుగా..
రోసౌ: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. సుదీర్ఘమైన సిరీస్ ఇది. వచ్చేనెల 13వ తేదీ వరకు టీమిండియా అక్కడే ఉంటుంది. వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, అయిదు టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లను ఆడనుంది. ఈ నెల 12వ తేదీన తొలి టెస్ట్ ఆరంభమౌతుంది. డొమినికాలోని రోసౌ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక.
ఇప్పటికే జట్టు ప్లేయర్లందరూ వెస్టిండీస్ చేరుకున్నారు. నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటోన్నారు. ఈ సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. టెస్టులు, వన్డేల కోసం రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. దీని తరువాత అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం మరో జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. టీ20 స్పెషలిస్టులను కరేబియన్ దీవులకు పంపిస్తుంది.
కాగా- ఈ సిరీస్ కోసం కేప్టెన్ రోహిత్ శర్మ.. కొత్తగా తయారయ్యాడు. ఇదివరకు గుబురు గడ్డంతో కాస్త లావుగా కనిపించిన రోహిత్ శర్మ- ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ లుక్‌ను సంతరించుకున్నాడు. తన పాత అవతారాన్ని చూపించాడు. క్లీన్ షేవ్‌తో మెరిసిపోతూ కనిపించాడు హిట్ మ్యాన్. అలాగే కాస్త బరువు కూడా తగ్గాడు. ఊబకాయాన్ని కంట్రోల్‌లో పెట్టుకున్నాడు.

ఈ లుక్ కాస్త పాత రోహిత్ శర్మను గుర్తుకు తెచ్చినట్టయింది. ఓల్డ్ అవతార్‌లో మెరిసిన రోహిత్ శర్మ.. ఇక బ్యాటింగ్‌లోనూ ఓల్డ్ స్టైల్‌తో చెలరేగిపోతాడంటూ అభిమానులు సంబరపడుతున్నారు. టీమిండియాతో పోల్చుకుంటే వెస్టిండీస్ జట్టు కాస్త బలహీనమే. సొంత గడ్డపై ఆడటం కరేబియన్ కింగులకు కలిసి వచ్చే అంశం. ఇక్కడ రోహిత్ శర్మ ఎలా ఆడుతాడనేది ఆసక్తి రేపుతోంది.
టెస్టుల కోసం ఎంపిక చేసిన జట్టులో- రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ ఉన్నారు.
వన్డే టీమ్‌లో- రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్-కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్ ఉన్నారు.
-
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
T20 World Cup Final: భారత పేసర్ కు ఐసీసీ డబుల్ షాక్..! -
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..!












Click it and Unblock the Notifications