Youtube: వారికి షాకిచ్చిన యూట్యూబ్.. 1.9 మిలియన్ వీడియోల డిలీట్..
యూట్యూబ్ మూడేళ్ల పిల్లాడి నుంచి వృద్ధుల వరకు చేసే ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ గా ఉంది. యూట్యూబ్ చూసి ఆనందించడమే కాదు. యూట్యూబ్ తో డబ్బులు సంపాదించే వారు చాలా మంది ఉన్నారు. భారత్ లో యూట్యూబ్ ను ఉపాధి మలుకుచి లక్షల్లో సంపాదిస్తున్నవారు భారీగా ఉన్నారు. అయితే యూట్యూబ్ మాతృ సంస్థ గూగుల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు యూట్యూబ్ లో 1.9 మిలియన్ల్ వీడియోలు డిలీట్ చేశారు.
భారత్ లో జనవరి మార్చి మధ్య ఈ వీడియోలు తీసేసినట్లు యూట్యూబ్ పేర్కొంది. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ యూట్యూబ్ పొందే ఫ్లాగ్‌లు, పాలసీలను ఎలా అమలు చేస్తుందనే దానిపై గ్లోబల్ డేటాను విడుదల చేస్తారు. అలాగే అమెరికాలో 6లక్షల 54వేల 968, రష్యాలో 4లక్షల 91వేల 933, బ్రెజిల్ లో 4లక్షల 49వేల 759 వీడియోలు డిలీట్ చేసినట్లు నివేదికలో పేర్కొంది. "ఒక కంపెనీగా ప్రారంభ రోజుల నుంచి, మా కమ్యూనిటీ మార్గదర్శకాలు YouTube కమ్యూనిటీని హానికరమైన కంటెంట్ నుంచి రక్షించాయి. మేము మెషిన్ లెర్నింగ్, హ్యూమన్ రివ్యూయర్‌ల కాంబినేషన్ ను ఉపయోగించి మా విధానాలను అమలు చేస్తాం" అని యూట్యూబ్ స్పష్టం చేసింది.

యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 2023 మొదటి త్రైమాసికంలో YouTube 8.7 మిలియన్ ఛానెల్‌లను కూడా తీసివేసింది. ఈ సమయంలోనే 853 మిలియన్ కంటే ఎక్కువ కామెంట్స్ ను కూడా డిలీట్ చేసింది. జూన్ లో యూట్యూబ్ స్టోరీ ఎంపికన తీసివేసింది. యూట్యూబ్ స్టోరీస్ ఫీచర్ 10,000 కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న వారికి అందుబాటులో ఉండేది. దాన్ని జూన్ లో పూర్తిగా తొలగించారు. అంతకాకుండా మానిటైజేషన్ కు సబ్స్క్రైర్ల సంఖ్యను 1000 నుంచి 500 తగ్గించారు. యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ లో చేరడానికి 500 మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉండాలి.
గత 90 రోజుల్లో మూడు పబ్లిక్ అప్‌లోడ్‌లు చేయడంతో పాటు సంవత్సర కాలంలో 3,000 గంటల వాచ్ అవర్స్ ఉండాలి. లేదా చివరి 90 రోజుల్లో 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి. ఈ కొత్త నిబంధనలను మొదటగా అమెరికా, బ్రిటన్, కెనడా, దక్షిణ కొరియా, తైవాన్ లో అమలు చేస్తున్నారు. దీన్ని త్వరలో ఇండియాలో కూడా ప్రవేశపెట్ట అవకాశం ఉంది. ఇక ఇండియాలో యూట్యూబ్ పై ఆదాయం పొందేవారు క్రమంగా పెరుగుతోన్నారు. దేశ జీడీపీకి యూట్యూబ్ ద్వారా రూ.6800 కోట్ల ఆదాయం వస్తోందట. యూట్యూబ్ తో దాదాపు 7 లక్షల మందికి ఉపాధి పొందుతున్నారు. 2021లో యూట్యూబ్ ఇండియా మెుత్తం 7,50,000 ఫుల్ టైమ్ ఉద్యోగాలకు సమానమైన జాబ్స్ సృష్టించిందని పలు నివేదికలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications