కండోమ్ ల కోసం రూ. లక్ష ఖర్చు.. ఏం గుండె రా వాడిది..!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇన్ స్టా మార్ట్.. తన వార్షిక నివేదికను తాజాగా విడుదల చేసింది. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కనిష్టంగా రూ. 10 తో ప్రింటవుట్ లు తెప్పించుకోగా.. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఐఫోన్ ల కోసం ఏకంగా రూ. 4.3 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొంది. అలాగే చెన్నై కు చెందిన ఓ వ్యక్తి అయితే కండోమ్ ల కోసమే ఏకంగా రూ. లక్ష చెల్లించినట్లు వెల్లడించింది. ఇదిలాఉంటే కొచ్చికి చెందిన ఓ వ్యక్తి 368 సార్లు కేవలం కరివేపాకు మాత్రమే ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ తన వార్షిక నివేదికలో స్పష్టంచేసింది.
దేశంలో ఫుడ్ డెలివరీ యాప్స్ లో ఒకటిగా ఉన్న స్విగ్గీ ఇన్ స్టా మార్ట్.. ప్రజలకు నిత్యావసరాలను హోమ్ డెలివరీ చేస్తుంది. అయితే ప్రతీ ఏడాది మాదిరిగానే స్విగ్గీ ఇన్ స్టా మార్ట్.. తన వార్షిక నివేదికను తాజాగా విడుదల చేసింది. అందులో దేశవ్యాప్తంగా ఎక్కువ మంది కస్టమర్లు ఆర్డర్ చేసిన నిత్యావసరాల వివరాలను పొందు పరిచింది. ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఎక్కువగా ఆర్డర్ చేసిన జాబితాలో కరివేపాకు, పెరుగు, గుడ్లు, పాలు, అరటి పండ్లు తదితర నిత్యావసర వస్తువులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

ఈ వార్షిక నివేదిక ప్రకారం.. 2025లో కస్టమర్లు అధికంగా కొనుగోలు చేసిన వస్తువుల వివరాలను పొందుపరిచింది. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి లేటెస్ట్ మోడల్స్ కోసం రూ. 4.3 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొంది. అలాగే 2025 ఏడాదికి సంబంధించి ఓ వ్యక్తి అత్యధికంగా రూ. 22 లక్షలు ఖర్చు పెట్టినట్లు స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ స్పష్టం చేసింది. అలాగే ముంబై కు చెందిన ఓ వ్యక్తి రూ. 15.16 లక్షలు విలువైన బంగారాన్ని కొనుగోలు చేసినట్లు తన వార్షిక నివేదికలో పేర్కొంది. మరోవైపు ఓ కస్టమర్.. డెలివరీ బాయ్ కు ఏకంగా రూ. 68 వేలు టిప్ ఇచ్చినట్లు స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ తన నివేదికలో వివరించింది.












Click it and Unblock the Notifications