విషాదం: పికప్ ట్రక్కుకు విద్యుత్ షాక్, 10 మంది కన్వారియాలు మృతి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కూచ్ బెహార్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం అర్థరాత్రి కూచ్‌బెహార్‌లో జల్పేష్‌కు ప్రయాణిస్తున్న పికప్ ట్రక్కు విద్యుదాఘాతం సంభవించింది. దీంతో 10 మంది కన్వారియాలు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు.
గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. అక్కడ 16 మందిని చికిత్స కోసం జల్పైగురి ఆసుపత్రికి రెఫర్ చేశారు. "గాయపడినవారిని చంగ్రబంధ బిపిహెచ్‌సికి తీసుకొచ్చారు. హాజరైన వైద్యాధికారి మెరుగైన చికిత్స కోసం 16 మందిని జల్పైగురి జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి, అయితే క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది అని పోలీసులు తెలిపారు.

ఆస్పత్రికి తీసుకొచ్చినవారిలో 10 మంది చనిపోయినట్లు వైద్య అధికారి నిర్ధారించారని పోలీసులు తెలిపారు. వాహనంలోని డీజే సిస్టమ్‌కు చెందిన జనరేటర్ వైరింగ్ కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అర్ధరాత్రి సమయంలో, మెఖ్లిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధార్ల వంతెన వద్ద ఒక సంఘటన జరిగింది. జల్పేష్‌కు వెళుతున్న కన్వారియాలను తీసుకెళ్తున్న పికప్ వ్యాన్ విద్యుదాఘాతానికి గురైంది. ప్రాథమిక విచారణలో, వాహనం వెనుక భాగంలో అమర్చిన DJ సిస్టమ్ జనరేటర్ వైరింగ్ కారణంగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది అని మాతభంగా అదనపు పోలీసు సూపరింటెండెంట్ అమిత్ వర్మ వెల్లడించారు.
ప్రయాణికులంతా సీతాల్‌కుచి పోలీస్‌స్టేషన్‌కు చెందిన వారని, ఈ విషాద సంఘటన గురించి వారి కుటుంబాలకు సమాచారం అందించామని సదరు అధికారి తెలిపారు. "వాహనం సీజ్ చేయబడింది కానీ డ్రైవర్ తప్పించుకున్నాడు. సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు. పోలీసులు సహాయక చర్యలు అందిస్తున్నారు అని వర్మ చెప్పారు.












Click it and Unblock the Notifications