ట్రాక్టర్‌ను ఢీకొన్న రైలు: పది మంది మృతి, 30 మందికి గాయాలు
బిజ్నోర్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. మానవరహిత రైలు రోడ్డు క్రాసింగ్ వద్ద ట్రాక్టర్‌ను రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు బుధవారం చెప్పారు. ఈ ప్రమాదంలో పది మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు.
ప్రయాణికులతో క్రిక్కిరిసి ఉన్న ట్రాక్టర్ వ్యాగన్ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ సమీపంలో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సంభవించింది.

వ్యాగన్లో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. వారంతా గంగానది సమీపంలోని ఓ పవిత్ర స్థలానికి వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో 33 మంది గాయపడ్డారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
మీరట్‌లోని ఆస్పత్రిలో క్షతగాత్రులను చేర్చి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మానవరహిత లెవెల్ క్రాసింగ్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించింది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications