యాత్రికుల బస్సుపై ఉగ్ర కాల్పులు: లోయలో పడి 10 మంది మృతి, 30 మందికిపైగా గాయాలు
శ్రీనగర్: ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య కారణంగా 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. రియాసీ జిల్లాలో యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్ర మూకలు కాల్పులు జరపడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోతైన లోయలో పడినట్లు అధికారులు తెలిపారు.
बड़ा हादसा: जम्मू-कश्मीर के रियासी जिले में वैष्णो देवी से शिवखोड़ी दर्शन करने जा रहे श्रद्धालुओं की बस पर आतंकी हमला... 10 लोगों की मौत... 30 के करीब घायल#ReasiTerrorAttack #Reasi #Jammu #ShivKhori #VaishnoDevi #TerroristAttack #JammuKashmir pic.twitter.com/05cG28pP4I
— Naveen Prajapati (@KumarNaveen93) June 9, 2024
పది మంది ప్రాణాలు కోల్పోగా, 30 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. శివఖోరీ ఆలయానికి వెళ్తున్న క్రమంలో బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు పేర్కొన్నారు. ఘటనాస్థలంలో పారామిలటరీ, సైన్యం సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు.

ఉగ్రదాడుల నేపథ్యంలో రియాసీ జిల్లాతోపాటు పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. రహదారులపై వాహనాలను తనిఖీలు చేసి పంపిస్తున్నారు. దాడులు జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు.
A bus carrying pilgrims plunged into a deep gorge in #Jammu and #Kashmir’s #Reasi district on Sunday after suspected militants opened fire, casualties expected: official pic.twitter.com/m1JmWjI0GY
— Sajid Raina (@SajidRaina1) June 9, 2024
ఓ వైపు మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ఈ ఉగ్రవాదులు జరగడం గమనార్హం. ఉగ్రదాడులను ఖండిస్తూనే నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే. ఉగ్రదాడులను ఖండిస్తున్నట్లు చెప్పిన ఖర్గే.. మోడీ ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించాలన్నారు. శాంతి భద్రతలు కాపాడాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. ఇటీవల కాలంలో యాత్రికులపై దాడులు పెరిగాయన్నారు. మోడీ ప్రభుత్వం చెప్పినట్లుగా జమ్మూకాశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం ఏమీ లేదని విమర్శించారు.
Terrorist attack on a bus carrying pilgrims in J&K's Reasi, Congress President Mallikarjun Kharge says, "We unequivocally condemn this gruesome terror attack on our people and deliberate affront to our National Security...All the chest-thumping propaganda of bringing peace and… pic.twitter.com/Y0zOmphBSs
— ANI (@ANI) June 9, 2024
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications