కామాంధుడి పైశాచికం: 10నెలల చిన్నారిపై రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ కామాంధుడు కన్నుమిన్నూ కానక ఓ 10నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని వికాస్‌పురి ప్రాంతంలో జరిగిందీ ఘోరం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
శుక్రవారం రాత్రి పాపతో సహా తల్లిదండ్రులు ఇంటి బయట నిద్రిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో నిద్రలేచిన తల్లికి పాప కనిపించలేదు. పాప ఏమైపోయిందోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారు చుట్టుపక్కల వెతికారు.

ఓ నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ దగ్గర్లో పాప ఏడుపు వినిపించింది. అక్కడకు వెళ్లిన తల్లిదండ్రులకు దారుణమైన దృశ్యం కనిపించింది. పాపతో లైంగిక వాంఛ తీర్చుకుంటున్న ఆ దుర్మార్గుడిని చితక్కొట్టారు.
పాపను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications