సూట్ కేసులో మృతదేహం.. చీరలో చుట్టి కుక్కేశారు..
తెరిచి ఉంచిన సూట్ కేసులో మృతదేహాన్ని ఓ చీరలో చుట్టి లోక్ మాన్య తిలక్ టెర్మినస్ సమీపంలో విసిరేసి వెళ్లిపోయారు.
ముంబై: లోక్ మాన్య తిలక్ టెర్మినస్ సమీపంలో ఆదివారం నాడు రాత్రి ఓ సూట్ కేసులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. తెరిచి ఉంచిన ఆ సూట్ కేసులో మృతదేహాన్ని ఓ చీరలో చుట్టిపెట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తిలక్ నగర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు పంపించారు.
సునీత గుప్తా అనే స్థానికురాలు దీనిపై స్పందించారు.' కాస్త ప్రశాంతత కోసం నేనలా నడుస్తూ వెళ్తుంటే.. నాకో పెద్ద సూట్ కేసు కనిపించింది. ఏంటా అని దగ్గరికెళ్లి చూస్తే.. అందులో ఓ మృతదేహాం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాను' అని సునీత పేర్కొన్నారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఎర్రచీరలో చుట్టబడిన మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి తీసుకొచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు లోక్ మాన్య టెర్మినస్ పార్సిల్ విభాగం వెనుకవైపు దాన్ని విసిరేశారు. అది నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఎవరూ అంతగా గమనించలేదు.
మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతుడు 10ఏళ్ల లోపు బాలుడే అయి ఉంటాడన్న ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతదేహాంపై ఎటువంటి గాయాలు లేవని తెలిపారు. మృతదేహాం కుళ్లిపోకపోవడంతో.. హత్య జరిగింది గడిచిన 48గం.ల్లోనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. తిలక్ టెర్మినస్ పార్సిల్లో వచ్చిన ఈ మృతదేహాన్ని వెనుకవైపు విసురుంటారా? అన్న కోణంలోను దర్యాప్తు చేస్తున్నారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications