బాలుడిపై 16 ఏళ్ల బాలిక అత్యాచారయత్నం, గాయాలు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ బాలుడి పైన యువతి అత్యాచార ప్రయత్నం చేసింది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. లక్నో సమీపంలోని కుల్‌హౌలీ గ్రామంలో పది సంవత్సరాల బాలుడిపై సదరు మైనర్ బాలిక లైంగిక వేధింపులకు పాల్పడింది.
పదహారు సంవత్సరాల వయస్సు కలిగిన అమ్మాయి... మాయమాటలు చెప్పి బాలుడిని తన ఇంటికి తీసుకు వెళ్లింది. అతనిపై అత్యాచారయత్నం చేసింది. శృంగారం కోసం బాలిక బాలుడిని బలవంతం చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో బాలుడి ప్రయివేటు భాగాల నుంచి తీవ్ర రక్త స్రావమైంది.

విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు కాన్పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఇద్దరూ మైనర్లు కావడంతో కేసు నమోదు చేసే విషయంలో పోలీసులు డైలమాకు గురవుతున్నారు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ కింద కేసు నమోదు చేయవచ్చా అని చూస్తున్నారు.












Click it and Unblock the Notifications