100 మందికి పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి లూటీ
లక్నో: తెల్లవారు జామున ఎక్స్ ప్రెస్ రైలులోని సాధారణ కోచ్ లలోకి కొంత మంది సాయుధులు చొరబడ్డారు. ప్రయాణికుల పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గన్ పెట్టి వారి దగ్గర ఉన్న నగదు, నగలు, విలువైన వస్తువులు లూటీ చేసి అక్కడి నుంచి పారిపోయారు.
ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు సరిగ్గా 290 కిలోమీటర్ల దూరంలో సుల్తాన్ ఎక్స్ ప్రెస్ రైలులో ఈ దారుణం జరిగింది. సుల్తాన్ పూర్ నుంచి గుజరాత్ లోని అహమ్మదాబాద్ కు సుల్తాన్ ఎక్స్ ప్రెస్ రైలు బయలుదేరింది. మార్గం మధ్యలో 12 మంది సాయుధులు మారణాయుధాలు ధరించి రైలు కోచ్ లోకి చొరబడ్డారు.

తరువాత ఆయుధాలతో మారణాయుధాలతో ప్రయాణికులను బెదిరించారు. తరువాత వారి దగ్గర ఉన్న బంగారు నగలు మొత్తం లూటీ చేశారు.డబ్బులు లాక్కొన్నారు. ఎదురు తిరిగిన ప్రయాణికులను చితకబాదారు. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టడంతో ప్రాణ భయంతో ప్రయాణికులు హడలిపోయారు.
లూటీ చేసిన దుండగులు మార్గం మధ్యలో రైలు దిగి పారిపోయారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. 100 మంది ప్రయాణికులు లూటీకి గురైనారని, కేసు దర్యాప్తులో ఉందని రైల్వే పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications