రాత్రికి రాత్రి ఒడ్డుకొచ్చిన 100 తిమింగలాలు(వీడియో)
చెన్నై: తమిళనాడు రాష్ట్రం టుటికోరిన్ బీచ్ వద్ద దాదాపు వంద తిమింగలాలు ఒడ్డునకు కొట్టుకు వచ్చాయి. సోమవారం రాత్రి ఇవి ఒడ్డుకు కొట్టుకు వచ్చినట్లు చెబుతున్నారు. గమనించిన మత్స్యకారులు, అధికారులు వాటిని తిరిగి నీటిలోకి నెట్టేందుకు ప్రయత్నించారు.
అయితే, అవి మళ్లీ ఒడ్డుకు కొట్టుకువచ్చినట్లు చెబుతున్నారు. అవన్నీ చాలా చిన్న చిన్న తిమింగలాలని, ఇంత ఎక్కువ సంఖ్యలో బీచ్‌లో కొట్టుకు రావడం ఇదే తొలిసారి అని జిల్లా సీనియర్ అధికారి రవి అన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశిస్తామన్నారు.
గత ఏడాది ఆగస్ట్ నెలలో కూడా నాగపట్టణం జిల్లాలోని ఓ గ్రామ సమీపంలో 33 అడుగుల తిమింగలం ఒకటి కొట్టుకు వచ్చిందని చెప్పారు. నాడు ఈ తిమింగలం నాగపట్నం జిల్లాలోని సమీప గ్రామంలోకి కొట్టుకు వచ్చిందని చెప్పారు.
WATCH: Around 50 Small Fin Whales beached in Tuticorin in Tamil Nadu since last evening, number of them deadhttps://t.co/lyC7aMDZxv
— ANI (@ANI_news) January 12, 2016 
స్థానికుల రక్షించే ప్రయత్నాలు
టుటికోరిన్ వద్ద బీచ్ వద్ద చాలా తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చిన విషయం గమనించిన స్థానికులు, జాలర్లు వాటిని తిరిగి సముద్రంలోకి వదిలేందుకు చేస్తున్న ప్రయత్నం దృశ్యం.

తిమింగలాలు
తమిళనాడులోని టుటికోరిన్ వద్ద బీచ్ వద్ద చాలా దాదాపు వంద తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చిన దృశ్యం.

తిమింగలాలు
తమిళనాడులోని టుటికోరిన్ వద్ద బీచ్ వద్ద చాలా దాదాపు వంద తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. సముద్రంలోకి వదిలే ప్రయత్నం.

తిమింగలాలు
టుటికోరిన్ వద్ద బీచ్ వద్ద చాలా తిమింగలాలు కొట్టుకు రావడంతో కొన్నింటిని నీటిలోకి వదిలిన దృశ్యం.

తిమింగలాలు
టుటికోరిన్ వద్ద బీచ్ వద్ద చాలా తిమింగలాలు కొట్టుకు రావడంతో కొన్నింటిని నీటిలోకి వదిలిన దృశ్యం.

తిమింగలాలు
తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చిన విషయం తెలిసి స్థానిక జాలర్లు వాటిలో చాలా వాటిని తిరిగి సముద్రంలోకి వదిలారు.












Click it and Unblock the Notifications