వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై సెంట్రల్ జైలులో ఖైదీలు, సిబ్బందితో సహా 103 మందికి కరోనా పాజిటివ్

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో కంట్రోల్ లోకి రావటం లేదు .ముఖ్యంగా ముంబై లో కరోనా ప్రమాద గంటలు మోగిస్తుంది. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అరికట్టటానికి ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తున్నా కరోనా కేసులు మాత్రం రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇక తాజాగా నమోదైన కేసులు చూస్తే 17,974 కేసులు నమోదు కాగా 13,979 మందికి యాక్టివ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారు 3,301 మంది కాగా 694 మంది మృతి చెందారు . ముఖ్యంగా ముంబై లో 11,394 కేసులు నమోదు అయ్యాయి అంటే సమస్య తీవ్రత ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు .

అక్కడ పోలీసులకు కరోనా టెర్రర్ .. ఒకే పోలీస్ స్టేషన్ లో 26 మందికి కరోనాఅక్కడ పోలీసులకు కరోనా టెర్రర్ .. ఒకే పోలీస్ స్టేషన్ లో 26 మందికి కరోనా

నిన్న పోలీసులకు కరోనా.. ఇప్పుడు సెంట్రల్ జైలులో 103మందికి కరోనా

నిన్న పోలీసులకు కరోనా.. ఇప్పుడు సెంట్రల్ జైలులో 103మందికి కరోనా

నిన్నటికి నిన్న ఒకే పోలీస్ స్టేషన్ లో 26 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇక ఈ షాక్ నుండి కోలుకోకముంది ముంబై సెంట్రల్ జైలు లో 103మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది . నిన్న ముంబైలోని జెజె మార్గ్ పోలీస్ స్టేషన్ కు చెందిన 26 మందికి కరోనా పాజిటివ్ రావటంతో వారిని ప్రస్తుతం క్వారంటైన్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే కరోనా నిర్దారణ అయిన అధికారులతో కాంటాక్ట్ లో ఉన్న మిగతా పోలీసుల వివరాలు సేకరించి వారిని కూడా క్వారంటైన్ చేస్తున్నామని చెప్తున్నారు . ఇక ఇదే సమయంలో సెంట్రల్ జైలు లో కరోనా కలకలం రేగింది .

 ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో కరోనా కలకలం

ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో కరోనా కలకలం

ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో మొత్తం 103 మంది ఖైదీలు, సిబ్బంది కరోనావైరస్ కోసం పాజిటివ్ పరీక్షలు చేసినట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ గురువారం తెలిపారు. వీరిలో 26 మంది సిబ్బంది ఉన్నారు. పాజిటివ్ గా నిర్ధారించిన వారిని నేడు ఉదయం సెయింట్ జార్జ్, జిటి ఆసుపత్రికి తరలిస్తామని, ఇప్పటికే జైలులో కరోనా పాజిటివ్ ఉన్న వారిని వేరుచేశామని అధికారులు తెలిపారు. అంతకుముందు, ఒక అండర్ ట్రయల్ ఖైదీకి, ఇద్దరు సిబ్బంది పాజిటివ్ పరీక్షించారు. దీని తరువాత గత రెండు రోజులలో 150 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

సామర్ధ్యాన్ని మించి ముంబై సెంట్రల్ జైలు లో ఖైదీలు

సామర్ధ్యాన్ని మించి ముంబై సెంట్రల్ జైలు లో ఖైదీలు

ముంబై సెంట్రల్ జైలు దేశంలో అత్యంత రద్దీగా ఉండే జైళ్లలో ఒకటి. ఇక్కడ 2,600 మంది ఖైదీలు ఉన్నారు. దీని సామర్థ్యం 800 మాత్రమే అయినా ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో ఖైదీలున్నారు. ఇక కరోనా పాజిటివ్ వచ్చిన ఈ ఖైదీలు, సిబ్బందితో పరిచయం ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్ చెయ్యటానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఏదేమైనాజైలు సామర్ధ్యాన్ని మించి అందులో ఖైదీలు ఉన్న కారణంగా సామాజిక-దూరం అసాధ్యం కావడంతో, జైలు కరోనా వ్యాప్తికి హాట్‌స్పాట్‌గా మారింది. ఇక సెంట్రల్ జైలు లో ఒక్కో బారక్ లో 500 మంది వరకు ఖైదీలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

Recommended Video

IPL 2020 Need To Start ASAP, It Can Change The Mood Of People In Entire Country
ముంబైలో కంట్రోల్ లోకి రాని కరోనా

ముంబైలో కంట్రోల్ లోకి రాని కరోనా

ఓ బ్యారక్ లో ఉండే ఖైదీలలో 77 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాదు, ఆ జైలులో పనిచేస్తున్న సిబ్బందిలో 26 మందికి కూడా కరోనా పాజిటివ్ అని తేలటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఇక ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా సరే ముంబైలో కరోనా కంట్రోల్ లేకుండా పెరిగిపోతూనే ఉంది . ముఖ్యంగా అక్కడ లాక్ డౌన్ విధులు నిర్వర్తిస్తున్న వారికి కరోనా టెన్షన్ పెడుతుంది .

English summary
Maharashtra home minister Anil Deshmukh said A total of 103 inmates and staff of Arthur Road jail in Mumbai have tested positive for coronavirus , These include 26 staff members.Officials said those who tested positive will be shifted to St George and GT Hospital on today morning, and have already been segregated within the jail. Earlier, an undertrial and two staffers had tested positive, following which swabs of 150 others were taken in the last two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X